బాణంతో చరిత్ర రాస్తోన్న తెలుగు తేజం.. వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడలకు జ్యోతి సురేఖ ఎంపిక..!
Jyothi Surekha Vennam: అంతర్జాతీయ విలువిద్య రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న తెలుగు క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నం మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. ప్రతిష్టాత్మక 2026 ఆసియా క్రీడలకు భారత జట్టులో చోటు దక్కించుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. వరుసగా నాలుగోసారి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, తన అద్భుతమైన గురితో పతకాల వేటకు సిద్ధమయ్యారు. బాణం ఆమెది.. రికార్డుల చరిత్ర దేశానిది..! ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈ విలువిద్య సంచలనం చిన్నతనం నుంచే బాణాన్ని నమ్ముకుని ప్రయాణాన్ని…
