ఆ తర్వాత ‘కొండవీటి సింహాసనం’, ‘ఖైదీ బ్రదర్స్’, ‘శ్రావణమాసం’ వంటి పలు చిత్రాల్లో నటించారు. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ కనిపించి మెప్పించారు. సినిమాల కంటే ఉదయభానుకు టెలివిజన్ రంగమే లైఫ్ ఇచ్చింది. వన్‌మెన్ షో లాగా అప్పట్లో ఈమె యాంకరింగ్‌తో టీవీ షోలను నడిపించేవారు. ఈటీవీలో వచ్చిన హృదయాంజలి షో ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘ఫ్యామిలీ సర్కస్’, ‘ఢీ’ (డ్యాన్స్ షో), ‘జాక్‌పాట్’, ‘సాహసం చేయరా డింభకా’ వంటి ఎన్నో సూపర్ హిట్ షోలకు ఆమె హోస్ట్‌గా వ్యవహరించారు.
