తాజావార్తలు

జిమ్‌కు వెళ్లే ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాల్సింటే.. దీన్ని మించిన ప్రీ వర్కౌట్ లేదు..

ఇందులో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బీట్‌రూట్‌లో ఫోలేట్, పొటాషియం, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంతో కీలక పాత్ర పోషిస్తాయి. రోజూ ఆహారంలో బీట్‌రూట్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన తక్షణ శక్తి, విటమిన్లు సులభంగా అందుతాయి. జిమ్‌కు వెళ్తూ.. వర్కౌట్స్‌ చేసే వారికి ఇది బెస్ట్ ఎనర్జీ బూస్టర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఉండే సహజ నైట్రేట్లు కండరాలకు రక్తప్రసరణను,…

Read More

పులి కోసం 14 ఏళ్ల ఎదురుచూపులు.. కవ్వాల్ టైగర్ జోన్‌పై ఎందుకు రగడ?

తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. పులుల సంరక్షణ కోసం టైగర్ జోన్ ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నా.. ఆశించిన స్థాయిలో పులుల సంచారం కనిపించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అటవీశాఖ మాత్రం కవ్వాల్‌ను పులులకు అనువైన ఆవాసంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెబుతోంది. దీంతో టైగర్ జోన్‌పై స్థానికులు, అటవీశాఖ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. 2012లో టైగర్ జోన్ ఏర్పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జన్నారం కేంద్రంగా…

Read More

వాడిపోతున్న మొక్కలకు రూపాయి ఖర్చులేని అలోవెరా ఫర్టిలైజర్

కుండీలలో నీరు నిలిచిపోయి వేరుకుళ్లు తెగులు రాకుండా డ్రైనేజీ సరిగ్గా ఉండేలా చూసుకోవడంతో పాటు, ప్రతి 15 రోజులకోసారి రూపాయి ఖర్చులేని సహజసిద్ధమైన లిక్విడ్ ఫర్టిలైజర్‌ను అందిస్తే చనిపోయే స్థితిలో ఉన్న మొక్కలు సైతం మళ్లీ ప్రాణం పోసుకుని చిగురిస్తాయి. కలబందలో మొక్కలకు అవసరమైన ఎంజైమ్‌లు, విటమిన్లు, యాంటీఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి; ఇది అద్భుతమైన రూటింగ్ హార్మోన్‌గా, క్రిమినాశినిగా మరియు గ్రోత్ బూస్టర్‌గా పనిచేస్తుంది. 'హారిక క్రియేటివ్ ఐడియాస్' ఛానల్ అందించిన ఈ హోమ్‌మేడ్ అలోవెరా…

Read More

ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.2 లక్షల జీతం

ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశం. దేహ్రాదూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జులై 2027లో ప్రారంభమయ్యే 145వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC-145)లో ప్రవేశానికి అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఇండియన్ ఆర్మీ ఆన్‌లైన్‌ దరఖాస్తులను కోరుతోంది. అర్హత ఉన్న అభ్యర్థులు 2026 సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ కోర్సు ద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా పోస్టుల వివరాలు…..

Read More

Onion Tomato Chutney Recipe: రెగ్యులర్ చట్నీలతో బోర్ కొట్టిందా? ఈ ఉల్లిపాయ టమాటా చట్నీ ట్రై చేయండి!

ఈ చట్నీ తయారీకి పెద్దగా పదార్థాలు అవసరం లేదు. ఉల్లిపాయలు, టమాటాలు, ఎండు మిరపకాయలు, ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు, మెంతులతో ముందుగా చట్నీని తయారు చేసి, చివర్లో వెల్లుల్లి, కరివేపాకు, పప్పులతో మంచి పోపు పెడితే రుచి మరింత పెరుగుతుంది. తక్కువ సమయంలో తయారయ్యే ఈ చట్నీని మీకు నచ్చిన స్థాయిలో కారం తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. ఉల్లిపాయ టమాటా చట్నీకి కావలసిన పదార్థాలు మధ్యస్థ పరిమాణ ఉల్లిపాయలు – 6 మధ్యస్థ పరిమాణ టమాటాలు…

Read More

మదురోను పట్టుకునే ముందు AI గ్రోక్‌ను గంటల తరబడి ప్రశ్నించిన ట్రంప్‌

ఆ తర్వాత జనవరి 2026లో అమెరికా బలగాలు వెనిజులా రాజధాని కరాకస్‌పై సైనిక ఆపరేషన్ చేపట్టాయి. మదురో, ఆయన భార్య అమెరికా అదుపులోకి వెళ్లారు. ఆ సమయంలో వెనిజులాలో మదురో వ్యతిరేకవర్గాల్లో సంబరాలు కనిపించాయి. ట్రంప్ కూడా Grok చెప్పిన సమాధానం ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సరిపోలడంతో ఆశ్చర్యపోయారు. అయితే Grok సమాధానం వల్లే మదురోను పట్టుకునే నిర్ణయం తీసుకున్నారా? అన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం లేదు. ఆపరేషన్‌కు ముందు Grokను ఆశ్రయించిన ట్రంప్?…

Read More

మళ్లీ దగ్గరవుతోన్న భారత్‌-చైనా

భారత్‌, చైనా మళ్లీ చేతులు కలపబోతున్నాయి. పహల్గామ్‌ ఎటాక్‌ తర్వాత పాకిస్తాన్‌ గగనతంలోకి భారత విమానాల ఎంట్రీకి బ్రేక్‌ పడటంతో.. చైనాతో భారత్‌ చర్చలు జరుపుతోంది. చర్చలు సఫలమైతే ముంబై, ఢిల్లీ నుంచి బయలుదేరే విమానాలు ఇక లేహ్‌ నుంచి చైనా భూభాగంలోకి ఎంటరై.. కజికిస్తాన్‌ మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, తదనంతర పరిణామాలతో భారత్‌ విమానయాన సంస్థలకు పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసేసింది. దీంతో పాకిస్తాన్…

Read More

Vaibhav Sooryavanshi: అంతర్జాతీయ వేదికపై చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi: భారతీయ క్రికెట్ రంగానికి చెందిన టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనతను సాధించాడు. కేవలం 15 సంవత్సరాల వయసులోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కుర్రాడు, ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన TIME100 Next జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. భవిష్యత్తును తీర్చిదిద్దే వర్ధమాన తారల జాబితాలో ప్రపంచం నలుమూలల నుంచి ఎంపిక చేసిన ఏడుగురు అథ్లెట్లలో వైభవ్ ఒకడిగా నిలిచాడు. విశేషం ఏంటంటే ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక…

Read More

ODI World Cup 2027: గ్రూప్ దశ తర్వాతే అసలు ఆట.. వరల్డ్‌కప్‌లో ‘సూపర్-7’ స్టేజ్ ఏంటంటే?

ODI World Cup 2027: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌కప్ 2027 షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ టోర్నమెంట్‌‌ను మరింత ఉత్కంఠగా మార్చేందుకు ఐసీసీ పలు కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా సెమీఫైనల్స్ ఆడే ముందు సరికొత్తగా సూపర్-7 స్టేజ్‌‌ను ప్రవేశపెట్టి క్రికెట్ అభిమానులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. గతంలో గ్రూప్ దశ ముగిసిన వెంటనే నేరుగా సెమీఫైనల్స్ జరిగేవి. కానీ ఈసారి ఆ పద్ధతిలో మార్పు చేసి జట్ల మధ్య…

Read More

300లకు పైగా సినిమాలు.. తొలి సినిమాకే రూ. 15 రెమ్యునరేషన్.. ఈ హీరోయిన్ రేంజే వేరు

ఇప్పటి రోజుల్లో స్టార్ హీరోయిన్లు ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. హీరోలతో సమానంగా తమ మార్కెట్‌ను పెంచుకుంటూ భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితులు ఇలా ఉండేవి కాదు. అప్పట్లో సినిమాల బడ్జెట్‌లు కూడా తక్కువగానే ఉండేవి. హీరోలు, హీరోయిన్ల పారితోషికాలు కూడా ఇప్పటితో పోలిస్తే చాలా తక్కువ. కానీ కొందరు స్టార్ హీరోయిన్లు మాత్రం తమకున్న క్రేజ్, మార్కెట్‌ను బట్టి అప్పట్లోనే భారీ పారితోషికాలు అందుకున్నారు. అలాంటి స్టార్…

Read More