Gold Price: బంగారం ధరలు భారీగా పడిపోతాయా? రూ.1.10 లక్షల దిగువకు వస్తాయా? BofA అంచనా ఇదే!
Indialo Bangaram Dharalu: బంగారం ధరలు వరుసగా రెండో వారం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇన్వెస్టర్లలో ఆందోళన పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA) బంగారం ధరలపై కీలక అంచనాను వెల్లడించింది. ప్రస్తుత ఏడాది నాలుగో త్రైమాసికంలో బంగారం ధర ఔన్స్‌కు 4,000 డాలర్ల దిగువకు పడిపోయే అవకాశం ఉందని బ్యాంక్ అంచనా వేసింది. ధర సుమారు 3,750 డాలర్ల స్థాయికి చేరవచ్చని పేర్కొంది. భారత కరెన్సీలో ఇది సుమారు…
