Hyderabad: బుల్లెట్ ట్రైన్ మాకొద్దు.. ఆ గ్రామంలో ఆందోళనకు దిగిన జనాలు.. ఎందుకంటే?
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని బహుద్దుర్గుడా గ్రామంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూసేకరణ అంశం ఉద్రిక్తంగా మారింది. భూముల స్వాధీనం ప్రక్రియలో భాగంగా హైడ్రా అధికారులు గ్రామానికి చేరుకోవడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు భూములను పరిశీలించేందుకు రావడంతో పెద్ద సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం తమ భూములను ఇవ్వాలంటే ముందుగా ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు….
