తాజావార్తలు

జూలై 18 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, వ్యాపారంలో శుభవార్తలు! మీ రాశికి ఇలా..

జూలై 18 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, వ్యాపారంలో శుభవార్తలు! మీ రాశికి ఇలా..


దిన ఫలాలు (జూలై 18, 2026): మేష రాశి వారికి ఉద్యోగం జీవితంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అయినప్పటికీ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఆదాయ ప్రయత్నాలు మరింత పుంజుకుంటాయి. వ్యాపారం పురోగతి చెందుతుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగం జీవితంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. స్థిరాస్తికి సంబంధించిన అమ్మకాలు, కొనుగోళ్లలో ఆశించిన లాభాలు పొందుతారు. వాహన యోగానికి అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధికి అనుకూల వాతావరణం ఉంది. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబపరంగా ఒకటి రెండు కోరికలు, ఆశలు నెరవేరే సూచనలున్నాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అయినప్పటికీ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఎవరినీఅతిగా నమ్మకపోవడం శ్రేయస్కరం. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తవచ్చు. ముఖ్యమైన పనుల్ని పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యక్తిగత సమస్యల్ని సమయస్ఫూర్తితో చక్కబెట్టడం జరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ప్రయాణాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలి.

ఇవి కూడా చదవండి



మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయ ప్రయత్నాలు మరింత పుంజుకుంటాయి. వ్యాపారం పురోగతి చెందుతుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. మీ వల్ల బంధుమిత్రులు కొందరు ఆర్థికంగా బాగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యుల మీద, ముఖ్యంగా జీవిత భాగస్వామి మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కొందరితో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో సంపాదనపరంగా పైచేయి సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఉద్యోగం విషయంలో శుభవార్త అందుతుంది. కొద్ది ప్రయాసతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందు తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో పురోగమిస్తాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా ఒకటి రెండు ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవు తాయి. స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాలు ఆశించిన లాభాలనిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త కార్యక్రమాలు చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ముందుకు వస్తాయి. ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలకు ఎదురుండదు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. అధికార వర్గాల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. స్వల్ప ధన లాభ సూచనలున్నాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. కొందరు బంధువులు, సన్నిహితులతో ఏర్పడ్డ వివాదాలు తగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పిల్లలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పరవాలేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు కూడా నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరిగే బాగా అవకాశం ఉంది. అయితే, దానితో పోటీగా ఖర్చులు కూడా పెరుగుతాయి. మిత్రుల మీద ఎక్కు వగా ఖర్చు చేయడం జరుగుతుంది. కొత్త లావాదేవీలకు సంబంధించి కొద్దిగా చికాకులు తప్పక పోవచ్చు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగు తాయి. పెళ్లి సంబంధం విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. తలపెట్టిన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కొందరు మిత్రులతో అపార్థాలు ఏర్పడే సూచనలున్నాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు కొంత మేరకు సఫలం అవుతాయి. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యో గంలో పదోన్నతికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు తప్పకుండా ఆశించిన శుభవార్త అందు తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితిలో బాగా మెరుగుదల కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. తలపెట్టిన పనులలో శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ, నిదానంగా వాటిని పూర్తి చేయడం జరుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

వృత్తి, ఉద్యోగాలు సమస్యలు, ఇబ్బందులు లేకుండా పురోగమిస్తాయి. వ్యాపారాల్లో కూడా సంపా దన నిలకడగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. మిత్రు లతో వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. ఇంటా బయటా పని ఒత్తిడి ఉంటుంది. కుటుంబపరంగా అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. కొత్త ఉద్యోగం విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు సజావుగానే సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యక్తిగ తంగా, కుటుంబపరంగా కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. చేయని పనికి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల నుంచి సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ధార్మిక సేవా కార్య క్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతానికి కొత్త ప్రయత్నాలు చేపట్టకపోవడం మంచిది. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం కూడా పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శి స్తారు. పిల్లల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది.

Also Read: గురు మూఢమిలో ఆస్తిపాస్తులు, ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *