Viral Video: రన్నింగ్ ట్రైన్ కిటికీకి యువకుడిని వేలాడదీసిన ప్రయాణికులు.. ఏం చేశాడో తెలిస్తే షాక్!
సోషల్ మీడియాలో ఓ సంచలన వీడియో వైరల్ అవుతోంది. కదులుతున్న రైలులో ప్రయాణికుడి మొబైల్ ఫోన్ను దొంగిలించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ప్రయాణికులు సాహసోపేతంగా పట్టుకున్నారు. అంతేకాదు అతడికి ఊహించని గుణపాఠం చెప్పిన ఘటన చర్చనీయాంశంగా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో రైలు వేగంగా ప్రయాణిస్తుండగా, కిటికీ వద్ద ఉన్న ప్రయాణికుడి మొబైల్ ఫోన్ను లాక్కోవడానికి దొంగ ప్రయత్నించాడు. అయితే దొంగ ప్రయత్నాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై అతడి చేతిని గట్టిగా పట్టుకున్నారు. దీంతో తప్పించుకునే…
