Moral Story: తెలివైన మేకపిల్ల: పరివారమంతా చనిపోయినా తన జీవితం ఎలా కాపాడుకుందంటే..?
ఒక అడవిలో ఒక నక్క దంపతులు ఆహారం కోసం వెతుకుతూ ఒక పచ్చిక బయలున్న మైదానానికి చేరుకున్నాయి. అక్కడ చిన్న మేకల గుంపు ఒకటి కనిపించింది. మగనక్క వెంటనే మేకలపై దాడి చేయాలనుకోగా, ఆడనక్క వారించి, తొందరపడవద్దని సలహా ఇచ్చింది. మేకలు చెల్లాచెదురు కాకుండా, వాటి వెనకగా వెళ్లి ఒంటరిగా ఉన్న బలమైన మేకను వేటాడదామని, ఇలా ప్రతిరోజూ ఒక మేకను చంపి ఆహార కొరత లేకుండా చూసుకోవచ్చని పన్నాగం పన్నింది. మగనక్క భార్య ఉపాయానికి తలూపింది….
