తాజావార్తలు

IND vs NZ: న్యూజిలాండ్ గడ్డపై భారత్‌ విధ్వంసం.. 720 పరుగులతో 10 చారిత్రక రికార్డులు

IND vs NZ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించింది. వెలింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 720 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకే పరిమితం కావడంతో భారత్‌కు 352 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో భారత జట్టు ఏకంగా 10 అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది….

Read Full News

బియ్యం కడిగిన నీటిని పారబోస్తున్నారా? మొక్కలకు వేస్తే జరిగే అద్భుతం ఇదే!

ఇంటి ఆవరణలో, టెర్రస్‌పై లేదా బాల్కనీలో పచ్చదనం కోసం చాలామంది మొక్కలు పెంచుతుంటారు. అయితే సరైన పోషణ, సంరక్షణ లేకపోవడం వల్ల తరచుగా మొక్కలు వాడిపోతుంటాయి. దీనివల్ల మళ్లీ కొత్త మొక్కలు కొనాల్సి వచ్చి డబ్బు వృథా అవుతుంది. కానీ మన వంటింట్లోనే లభించే ఒక సాధారణ పదార్థంతో మొక్కలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ప్రతి ఇంట్లో అన్నం వండే ముందు బియ్యం కడిగిన నీటిని వృథాగా పారబోస్తుంటాం. నిజానికి ఈ బియ్యం నీరు మొక్కలకు ఒక శక్తివంతమైన…

Read Full News

నన్ను క్షమించు అమ్మా.. మాట వినాల్సింది! ఎమోషనల్ అయిన టాలీవుడ్ హీరోయిన్

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ తాజాగా పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన తల్లిని ఉద్దేశిస్తూ ఆమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అమ్మ చెప్పిన మాటలను పట్టించుకోకుండా తనకు అన్నీ తెలుసని భావించినందుకు క్షమాపణలు చెబుతూ నభా ఆసక్తికరమైన నోట్‌ను షేర్ చేసింది. నభా నటేష్ తన పోస్ట్‌లో తల్లికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. చాలా…

Read Full News

CSIR UGC-NET 2026 డిసెంబర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ సబ్జెక్టు పరీక్ష ఎప్పుడంటే?

హైదరాబాద్‌, నవంబర్ 22: CSIR UGC-NET డిసెంబర్ 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్డేట్ ఇచ్చింది. పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 19, 22, 27 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలు, సమయాలు, షిఫ్టుల వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. NTA విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 19న లైఫ్…

Read Full News

భారీ గ్రహం రాకతో.. ఈ రాశులవారికి తిరుగుండదు, లెక్కలు మొత్తం మార్చేస్తారు

జ్యోతిష్య శాస్త్రం చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి ఎప్పటికప్పుడు స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. బుధుడు తన రాశిని మార్చుకోనున్నాడు. దీనివల్ల ఈ రాశుల వారి జీవితంలో అన్ని మంచి రోజులే. అప్పులన్నీ క్లియర్ అవుతాయి. అలాగే అన్నింట్లోనూ విజయం సాధిస్తారు. అంతక ముందు ఆగిపోయిన పనుల…

Read Full News

Weekly Horoscope: ఈ వారం ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆదాయం, ఉద్యోగంలో ఊహించని శుభవార్తలు!

Weekly Rashi Phalalu : మేషం రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. వృషభం రాశి వారికి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి రంగంలో ఉన్నవారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మిథునం రాశి వారికి ఉద్యోగ జీవితం బాగా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడి బాగా…

Read Full News

అందం కోసం ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడితే కిడ్నీలు ఖతం.. 17 ఏళ్ల బాలికకు ప్రాణాంతక వ్యాధి!

కేరళ: అందంగా కనిపించాలనే ఆశతో సోషల్ మీడియా ప్రకటనలను నమ్మి సౌందర్య ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ ఘటన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రచారాన్ని నమ్మి ఆన్‌లైన్‌లో ఫెయిర్‌నెస్ క్రీమ్ కొనుగోలు చేసి ఉపయోగించిన 17 ఏళ్ల బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. చివరకు ఆమెకు ప్రమాదకరమైన కిడ్నీ వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కేరళలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మలప్పురానికి…

Read Full News

Anirudh Kavya Wedding : గ్రాండ్‏గా అనిరుధ్, కావ్య రిసెప్షన్.. సినీ ప్రముఖుల సందడి.. ఫోటోస్ ఇదిగో..

సౌత్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, కావ్య మారన్ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గ్రీస్ కంట్రీలో జరిగింది. ఇక ఇప్పుడు శనివారం చెన్నైలో వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులతోపాటు క్రీడాకారులు సైతం విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా విచ్చేసి దంపతులను అభినందించారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,…

Read Full News

సింహాచలం అప్పన్న దర్శనానికి డ్రెస్ కోడ్.. ఈ దుస్తులతో వస్తే నో ఎంట్రీ.. డిసెంబర్ నుంచే కొత్త నిబంధనలు!

Simhachalam Temple Dress Code: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. టీషర్ట్స్, జీన్స్, స్లీవ్ లెస్‌తో వస్తే స్వామివారి ఆలయంలోకి ఎంట్రీ ఉండదు. సింహాచలం ఆలయంలో డ్రెస్‌ కోడ్‌ నిబంధనను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నిబంధన అమల్లోకి తెస్తున్నారు. ఇకపై దర్శనానికి వచ్చే పురుషులు ధోతి, పంచె, కుర్తా…

Read Full News

Sabarimala: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. విమాన క్యాబిన్‌లో ఇరుముడికి మరోసారి అనుమతి!

Sabarimala Ayyappa Temple: అయ్యప్ప భక్తులకు శుభవార్త. శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు విమాన ప్రయాణంలో మరోసారి ఊరట లభించింది. పవిత్రమైన ఇరుముడిని విమాన క్యాబిన్‌లో తమ వెంట తీసుకెళ్లేందుకు వరుసగా మూడో ఏడాది కూడా అనుమతి కొనసాగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సాధారణంగా విమాన ప్రయాణాల్లో భద్రతా నిబంధనల కారణంగా కొన్ని వస్తువులను క్యాబిన్‌లోకి అనుమతించరు. అయితే అయ్యప్ప భక్తుల ఆచారాలు, మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఇరుముడి విషయంలో ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. భక్తుల…

Read Full News