తాజావార్తలు

మళ్లీ వచ్చేశారు.. వణికిస్తున్న ముసుగు దొంగలు.. మారణాయుధాలతో కాలనీల్లో సంచారం!

తెలంగాణలోని కామారెడ్డి పట్టణంలో మరోసారి ముసుగు దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి వేళ పలు కాలనీల్లో సంచరిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. రెండు ఇళ్లలో నగదును అపహరించినట్లు సమాచారం. ఈ ఘటనలతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రం శివారులోని దేవీవిహార్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో తాళం వేసి ఉన్న ఇంటిని దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు,…

Read Full News

పొలంలో చవక.. మార్కెట్‌లో ప్రియం! రైతుకు నష్టం.. వినియోగదారుడికి భారం!

రైతు పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధర ఉండదు.. అదే కూరగాయలు మార్కెట్‌కు చేరేసరికి వినియోగదారుడి జేబుకు చిల్లు పెడతాయి. పొలంలో కిలో టమాటా ధర రూ.10 పలికితే.. నగరంలోని దుకాణంలో అదే టమాటా రూ.30కి అమ్ముడవుతుంది. మరి ఈ మధ్యలో జరుగుతున్నదేంటి? రైతు, వినియోగదారుడి మధ్య ధరల్లో ఇంత వ్యత్యాసం ఎందుకు? భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అధ్యయనం ఈ ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు వెల్లడించింది. పొలంలో పండితే నష్టం.. మార్కెట్‌కు వస్తే భారం! ఒక రైతు…

Read Full News

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అగంతకుడి చొరబాటు యత్నం.. CISF జవాన్ల మెరుపు యాక్షన్!

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. సరైన ప్రయాణ పత్రాలు లేకుండానే విమానాశ్రయ టెర్మినల్‌లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) జవాన్లు అడ్డుకున్నారు. వేగంగా స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ IGI ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-3 డిపార్చర్ గేట్ వద్ద బుధవారం (నవంబర్ 18) ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి సరైన ప్రయాణ…

Read Full News

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. రుక్మిణి కోట సంచలన ప్రకటన!

ఏపీలో జనసేన నేతల పేర్లు ఉపయోగించి నిరుద్యోగుల నుంచి రూ.7కోట్లు వసూలు చేసిన కేసులో సీఐడీ దూకుడు పెంచింది. జనసేన నేతలు కోటా రుక్మిణి, కళ్యాణం శివ శ్రీనివాస్ పేర్లు ఉపయోగించి 35 మంది దగ్గర నుంచి.. ధరణీ కృష్ణ, పెద్దిరాజు ఏడు కోట్ల రూపాయలు వసూలు చేశారని తేల్చారు. జనసేన నేతల ఫిర్యాదుతో ధరణీ కృష్ణ, పెద్దిరాజులపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. డబ్బుల వసూలు వ్యవహారంలో ధరణీ కృష్ణ, పెద్దిరాజును…

Read Full News

Watch Video: దారుణం.. మూడేళ్ల చిన్నారి చేతులు తాడుతో కట్టేసి వేధించిన స్కూల్ సిబ్బంది!

తిరువారూరు, నవంబర్‌ 19: తమిళనాడులోని తిరువారూరు సమీపంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల ప్రీ-కేజీ విద్యార్థి చేతులను తాడుతో కట్టేసి, పాఠశాల సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఉపాధ్యాయురాలు, పారిశుద్ధ్య కార్మికురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాఠశాల సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తిరుత్తురైపూండికి చెందిన బి. గోపీనాథ్ ట్రావెల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆయన కుమారుడు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత…

Read Full News

Tulsi Plant : ఇది ఒక్క గ్లాస్ పోస్తే.. ఎండిపోతున్న తులసమ్మ గుబురుగా, పచ్చగా మారుతుంది

ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది.తులసి మొక్కలు వాడిపోవడం, ఎండిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. తులసి గుబురుగా, పచ్చగా ఉండాలంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే తులసి మొక్క బలంగా,గుబురుగా పెరగాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఈ టిప్స్ ఏంటో తెలుసుకుందాం.

Read Full News

అతనితో వర్క్ చేయడం ఒక పీడకల.. మాట్లాడే పద్ధతి కూడా తెలియదు.. స్టార్ హీరోపై హైదరాబాదీ హీరోయిన్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌ కు చెందిన బాలీవుడ్ నటి దియా మీర్జా గత కొన్ని రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. దీపావళికి ముందు, ఆమెకు సంబంధించిన ఒక వీడియోను బీఎంసీ (BMC) పంచుకుంది. ఈ వీడియోలో, దీపావళిని ఎలా జరుపుకోవాలో ఆమె ఒక సందేశం ఇచ్చారు. అయితే దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. చాలా మంది దియాను తప్పుపట్టారు. దీపావళి ఎలా జరుపుకోవాలో తమకు బోధించవద్దని రాజకీయ నాయకులు నటికి హిత బోధ చేశారు. అయితే ఎలాగోలా ఆ విషయం…

Read Full News

తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవం: భక్తులకు గుడ్ న్యూస్.. భరణి దీపం, మహా దీప దర్శనం ఉచితం!

Tiruvannamalai Karthigai Deepam 2026: ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటైన తమిళనాడులోని తిరువణ్ణామలైలో కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇక్కడి అన్నామలైయార్ ఆలయంలో నిర్వహించే ఈ వేడుకను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా 2,668 అడుగుల ఎత్తైన అరుణాచల పర్వతంపై వెలిగించే మహా దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఈ ఏడాది కూడా కార్తీక దీపోత్సవానికి ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 24న…

Read Full News

Dream Tips: రాత్రిపూట పీడకలలు వస్తున్నాయా? నిద్రపోయే ముందు ఈ పనులు తప్పక చేయండి!

How to Stop Nightmares Telugu: కలలు అనేవి నిద్రలో సహజంగా వచ్చే అనుభవాలు. కొన్ని కలలు మనకు ఆనందాన్ని కలిగిస్తే, మరికొన్ని భయాన్ని, ఆందోళనను కలిగిస్తాయి. ముఖ్యంగా కొంతమందికి తరచూ పీడకలలు వస్తుంటాయి. దీంతో నిద్ర మధ్యలో ఉలిక్కిపడి లేవడం, మళ్లీ నిద్ర పట్టకపోవడం, మరుసటి రోజు కూడా ఆ కలల ప్రభావంతో ఇబ్బంది పడటం జరుగుతుంది. నిజానికి పగటిపూట మనం ఎదుర్కొనే సంఘటనలు, ఆలోచనలు, భావోద్వేగాలు, మానసిక ఒత్తిడి వంటివి రాత్రి కలలపై ప్రభావం…

Read Full News

తల్లితోపాటు నిద్రిస్తున్న చిన్నారులను కాటేసిన పాము.. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా..

తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో తల్లితో కలిసి నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. కల్లకురిచి జిల్లాలోని శంకరపురం సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తొలుత చిన్నారుల మృతిపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. తాజాగా విడుదలైన పోస్టుమార్టం నివేదికలో వారిద్దరూ పాము కాటు వల్లే మరణించినట్లు నిర్ధారణ అయింది. వివరాల్లోకి వెళ్తే.. కల్లకురిచి జిల్లాలోని మూకనూర్ గ్రామానికి చెందిన చంద్రన్ తన భార్య పుష్ప, ఇద్దరు కుమార్తెలతో కలిసి…

Read Full News