రన్నింగ్‌లోనే ఊడిపోయిన స్కూల్ బస్సు రెండు టైర్లు.. ఊపిరి బిగపట్టిన 30 మంది విద్యార్థులు!
కడప జిల్లా పులివెందుల పరిధిలోని ముదునూరు రింగ్ రోడ్డు వద్ద సోమవారం (జూలై 06) ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 30 మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రన్నింగ్‌లో ఉండగానే వెనుక వైపు ఉన్న రెండు టైర్లు ఒక్కొక్కటిగా ఊడిపోయాయి. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే స్థానికుల అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముదునూరు రింగ్ రోడ్డు టర్నింగ్ వద్ద బస్సు…
