ఆరోగ్యానికి అమృతం లాంటిది ఈ కారం పొడి.. 6 నెలలు నిల్వ ఉండే పక్కా కొలతలు!
ఈ కారం పొడి తయారీకి మునగాకును ఎంచుకునేటప్పుడు మరీ లేతగా ఉన్నది కాకుండా, మరీ ముదిరిపోయినది కాకుండా మధ్యస్థంగా ఉన్న ఆకులను సేకరించాలి. ఆకులను కాడల నుండి వేరు చేసి, నీటిలో మూడు, నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి. ఆకుల్లో ఇసుక లేదా దుమ్ము ఏమీ లేకుండా చూసుకోవాలి. కడిగిన మునగాకును ఒక కాటన్ గుడ్డపై పరుచుకుని, తడి అంతా పూర్తిగా ఆరిపోయే వరకు నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఆకుల్లో ఏమాత్రం తడి ఉన్నా కారం పొడి ఎక్కువ…
