తాజావార్తలు

పెళ్లి రోజున సర్‌ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు.. కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్

పెళ్లి రోజున సర్‌ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు.. కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్


సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేవి చాలా కామన్ గా మారిపోయాయి. టాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో కంటే వివాదాలతో, వ్యక్తిగత విషయాలతో వార్తలతోనో ఎక్కువ పాపులర్ అవుతున్నారు . కొంతమంది ప్రేమ, పెళ్లి, విడాకుల వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. కాగా వరుస సినిమాతో హీరోయిన్స్‌గా అలరించిన చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఆ పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంతా బాగుంది అనుకునేలోగా విడాకులు అంటూ అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు. అలంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఆమె హీరోయిన్ గా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. కానీ ఆమె లైఫ్ లో ఊహించని షాక్ తగిలింది. పెళ్లి రోజునే భర్త విడాకుల పేపర్లు చేతిలో పెట్టి సర్ ప్రైజ్ అన్నాడు. దాంతో కన్నీరు మున్నీరు అయ్యింది ఆమె.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : ఏంటి అమ్మడు ఇది నువ్వేనా.!! ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్

ఒకప్పుడు తెలుగులో సినిమాలు చేసిన మెప్పించిన హీరోయిన్స్ లో సెలీనా జైట్లీ ఒకరు. మంచు విష్ణు నటించిన సూర్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆతర్వాత పెద్దగా తెలుగులో కనిపించలేదు. హిందీలో ఎక్కువగా సినిమాలు చేసి పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. 2011లో వ్యాపారవేత్త పీటర్ హాగ్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పుడు వీరి విడాకులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదవండి : బిగ్ బాస్ వల్ల చాలా కోల్పోయా.. ఉన్న ఫేమ్ మొత్తం పోయింది.. షాకింగ్ విషయం చెప్పిన నటి

విడాకుల పై సెలీనా జైట్లీ మాట్లాడుతూ.. నా భర్త మా 15వ పెళ్లి రోజున సర్‌ప్రైజ్ ఇస్తాడని ఆశించా.. అదే సమయంలో నన్ను కారులో పోస్టాఫీసుకు తీసుకెళ్లి కొన్ని పేపర్లు నా చేతిలో పెట్టాడు. అందులో జర్మన్ భాషలో రాసుంది నాకు జర్మన్ రాదు.. అందులో ఏముందో చెప్పమని అడగ్గా అతను చెప్పకుండా నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. నేను అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నా పిల్లలకు ఇచ్చి అది చదవమని చెప్పా.. నా భర్త నా పై చేసిన దారుణమైన ఆరోపణలను పిల్లల నోటి నుంచి వినాల్సి వచ్చింది.. మొదట అదొక జోక్ అనుకున్నా. కానీ అది నిజం అని తెలిసింది అని కన్నీళ్లు పెట్టుకుంది సెలీనా జైట్లీ. అంతే కాదు తన భర్త, అతని కుటుంబం ఆమె పై ఎదురుదాడికి దిగారు. ముంబై వెళ్లనివ్వమని పిల్లలు కావాలంటే ఆస్ట్రియాలోనే ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలని కండీషన్ పెట్టారు. దాంతో సెలీనా జైట్లీకూడా తన అత్తింటి వారిపై గృహహింస, వేధింపుల కేసులు పెట్టి భరణం, నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈవివాదం ముదరడంతో స్టార్ హీరోయిన్ జీవితం గందరగోళం అయ్యింది.

ఇది కూడా చదవండి : ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు.. అంతలా అడిక్ట్ అయిపోతాం : గుణశేఖర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *