తాజావార్తలు

Tata EV Discounts: టాటా ఈవీ కార్లపై బంపర్‌ ఆఫర్‌.. రూ.3.35 లక్షల వరకు డిస్కౌంట్‌..!

Tata EV Discounts: టాటా ఈవీ కార్లపై బంపర్‌ ఆఫర్‌.. రూ.3.35 లక్షల వరకు డిస్కౌంట్‌..!


Tata EV Discounts: మీరు కొత్త ఎలక్ట్రిక్‌ కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? మీకో గుడ్‌న్యూస్‌. ప్రముఖ దిగ్గజ కార్ల తయారీ సంస్థ టాటా తన కంపెనీ ఈవీ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. కంపెనీ సేల్స్ విస్తరణలో భాగంగా కంపెనీకి చెందిన అన్ని రకాల ఎలక్ట్రిక్‌ మోడళ్లపై దాదాపు రూ.3.35 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. టాటా కంపెనీ ఏయే ఈవీ మోడల్స్ పై ఎంతత డిస్కౌంట్ ఉందో తెలుసుకుందాం.

టాటా మోటార్స్ ఇటీవలే సియెర్రా ఈవీని విడుదల చేయడం ద్వారా ఈవీ పోర్ట్ ఫోలియోను విస్తరించింది. కంపెనీ మోడల్స్ సఫారీ, ఆల్టోజ్ లనుంచి ఈవీ లనువిడుదల చేస్తే మొత్తం పోర్ట్ పోలియాను 100శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్‌ గా మార్చినట్టే. సఫారీ ఈవీ ఈ ఏడాది విడుదల అవుతుందని భావిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది ఆల్టోజ్ ఈవీ వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. టాటా మోటార్స్‌ అందించే ఈ భారీ డిస్కౌంట్‌లో క్యాష్‌ డిస్కౌంట్‌ ఎక్స్చేంజ్, స్క్రాపేజ్ బోనస్, ఇంటర్వెన్షన్ బోనస్ ,లాయల్టీ బోనస్ ల ద్వారా దాదాపు రూ.3.35లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..!

  1. నెక్సాన్ ఈవీ రూ.50 వేల వరకు తగ్గింపు: టాటా మోటార్స్ అత్యధికంగా అమ్ముడయ్యే EVలలో నెక్సాన్ EV ఒకటి. దీనిపై కంపెనీ అతి తక్కువ డిస్కౌంట్లను అందిస్తోంది. రూ. 50 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఇందులో రూ.15వేల నగదు డిస్కౌంట్, రూ.35,000 వరకు ఎక్స్చేంజ్ / స్క్రాపేజ్ బోనస్ కలిపి నెక్సాన్ EV అన్ని వేరియంట్లపై రూ.50వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
  2. పంచ్ ఈవీపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్‌: టాటా మోటార్స్ ఈ ఏడాది ఆరంభంలో పంచ్ ఈవీని అప్డేట్ చేసింది. ప్రీ ఫేస్ క్రిప్ట్ మోడల్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది.LR వేరియంట్లు రూ. 1.1 లక్ష నగదు డిస్కౌంట్ తోపాటు గరిష్టంగా రూ.1.45 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఎంఆర్‌ వేరియంట్లు ట్రిమ్ లను బట్టి మొత్తం రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో రూ. 90 వేల వరకు నగదు డిస్కౌంట్ లభిస్తుంది.
  3. టియాగో ఈవీపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్‌: ఇటీవల టాటా మోటార్స్ టియాగో ఈవీని ఇంటీరియర్ మార్పులతో అప్‌డేట్‌ చేసింది. ఫ్రీ ఫేస్ స్క్రిప్ట మోడల్ పై రూ. 1.45 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు అందిస్తున్నారు. అన్ని MR వేరియంట్లపై రూ.40వేల క్యాష్ డిస్కౌంట్, మొత్తం రూ. 65వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ట్రిమ్ ను బట్టి, LR వేరియంట్లపై రూ.1 లక్ష వరకు నగదు డిస్కౌంట్ తో పాటు, రూ.25వేల ఎక్స్చేంజ్ /స్క్రా పేజ్ బోనస్ ,రూ.50వేల ఇంటర్వెన్షన్ బెనిఫిట్ లభిస్తాయి.
  4. హారియర్ ఈవీపై- రూ. 2.75 లక్షల వరకు డిస్కౌంట్‌: ఇక కంపెనీ ప్రధాన ఎలక్ట్రిక్ వాహనమైన హారియర్ EVపై రూ. 2.75 లక్షల వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ లిస్టులో ఇతర టాటా EVల వలె కాకుండా, హారియర్ EVకి జూలై 2026 నెలలో ఎలాంటి నగదు తగ్గింపులు లభించవు. దానికి బదులుగా దీనిపై రూ.1 లక్ష వరకు ఇంటర్వెన్షన్ బెనిఫిట్, రూ. 1 లక్ష వరకు లాయల్టీ బోనస్, రూ.75వేల వరకు స్క్రాపేజ్ లేదా ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు.
  5. కర్వ్వీ ఈవీపై రూ.3.35 లక్షల వరకు: EV వాహనాలపై టాటా అందించే అత్యధిక డిస్కౌంట్లు, బెనిఫిట్స్ విషయంలో ఎప్పటిలాగే కర్వ్ EV ముందుంది. దీనిపై రూ.3.35 లక్షల వరకు తగ్గింపుతో అందిస్తోంది. ఈ డిస్కౌంట్లు మే 2026లో రాబోయే X సిరీస్ అప్డేట్ కు ముందున్న కర్వ్ EV వేరియంట్లకు వర్తిస్తాయి. కర్వ్ EVపై లభించే నగదు తగ్గింపు రూ.3 లక్షల వరకు ఉంటుంది.

ఇది కూడా చదవండి: India Billionaires: మన దేశ బిలియనీర్ల ఆదాయం ఎంత? నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *