AP Weather: బిగ్ అలెర్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు.. అటు తెలంగాణలో..
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, వికారాబాద్, రంగారెడ్డి, వనపర్తిలో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా… సంగారెడ్డి, కామారెడ్డి, ములుగు, నాగర్ కర్నూలు, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని… అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, సత్యసాయి, అల్లూరి జిల్లాల్లో వానలు గట్టిగా పడుతున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరులో అకాల వర్షం వణికించింది. ఉరుములు, మెరుపులతో కూడిన…
