అంగన్‌వాడీ ఉద్యోగాలకు అప్లై చేయండి.. అమ్మాయిలకు మాత్రమే ఛాన్స్! చివరి తేదీ ఆగస్టు 5
తెలంగాణలో అంగన్‌వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్ధులకు సర్కార్ తీపికబురు చెప్పింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలోని మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 62 అంగన్‌వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఆగస్టు 5, 2026వ తేదీలోగా…
