అరెరె ఇంత ఈజీనా.. కల్తీ పాలని ఇంట్లోనే చిటికెలో గుర్తించండి..
మన ఆహారంలో పాలు ప్రధాన భాగం. పిల్లల శారీరక ఎదుగుదల నుంచి పెద్దల ఆరోగ్యం వరకు ప్రతి ఒక్కరూ రోజూ పాలను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే పాలు నిజంగా స్వచ్ఛమైనవేనా? పాల వ్యాపారంలో పెరుగుతున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు రసాయనాలు కలిపి కల్తీ పాలను మార్కెట్లోకి వదులుతున్నారు. కల్తీ పాలను తాగడం వల్ల స్వల్పకాలికంగా కడుపునొప్పి, జీర్ణ సమస్యలు రావడమే కాకుండా.. సుదీర్ఘకాలంలో కిడ్నీలు, పేగులపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు….
