తాజావార్తలు

MS Dhoni: ధోనీ వాటాల వార్తల్లో నిజం ఎంత? చెన్నై యాజమాన్యం క్లారిటీతో తెరపడిన ఉత్కంఠ

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో ధోనీ వాటాలు కోరారనే ప్రచారం క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున కలకలం రేపింది. ఈ ఊహాగానాలపై సీఎస్కే యాజమాన్యం అధికారికంగా స్పందిస్తూ స్పష్టత ఇచ్చింది. అదే సమయంలో కొత్త కోచ్ ఎంపిక, రాబోయే ఐపీఎల్ వ్యూహాలపై కూడా కీలక సమాచారం వెలువడింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో వాటాలను కొనుగోలు చేయడానికి ధోనీ ఆసక్తి చూపించారని, అయితే ఆయన పెట్టిన షరతులకు యాజమాన్యం అంగీకరించలేదని కొన్ని వార్తలు హల్‌చల్…

Read More

Director Srikanth Odela: ఏషనాగుల పాట డ్యాన్స్ పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్..

ది ప్యారడైజ్ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో తన సినిమా ఏషనాగుల పాటపై వచ్చిన విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు ఘాటుగా స్పందించారు. నటుడు నాని కూడా ఈ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. శ్రీకాంత్ తన దర్శకత్వ శైలి, ట్రైలర్‌ల పట్ల తనకున్న అభిప్రాయాలపై కూలంకషంగా వివరించారు. ఏషనాగుల పాట కొరియోగ్రఫీ గురించి మాట్లాడుతూ, కొన్ని స్టెప్పులకు నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, పాట లీక్ అవ్వడం కూడా ఒక కారణమని ఒప్పుకున్నారు….

Read More

AIతో మానవాళికి ముప్పు.. ఈ దశాబ్దంలోనే మనుషులంతా అంతమయ్యే ప్రమాదం!? సంచలన హెచ్చరిక

AI Could Pose an Extinction Risk Telugu: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి ఇప్పటివరకు జరిగిన చర్చలు ఎక్కువగా భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాల చుట్టూనే సాగాయి. అయితే ఈ వారం అమెరికాలో చోటుచేసుకున్న పరిణామాలతో AI ప్రమాదం అనే అంశం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. అత్యాధునిక AI వ్యవస్థలు భవిష్యత్తులో మానవాళికే ముప్పుగా మారే అవకాశం ఉందని వాటిని అభివృద్ధి చేస్తున్న కొందరు పరిశోధకులు తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘AI మనుషులందరినీ చంపే అవకాశం…

Read More

Bigg Boss : ఏడిపించేసిన బిగ్ బాస్.. 20 ఏళ్ల ప్రయాణంలో అందమైన జంట.. ఒక్క వీడియోతో గుండెలు పిండేశాడుగా..

బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 20 ప్రారంభమై వారం రోజులే.. అయినప్పటికీ ఒక్క ఎపిసోడ్ తో సోషల్ మీడియా మొత్తం హైలెట్ అయ్యింది. అడియన్స్, కంటెస్టెంట్స్ సహా అందరినీ కదిలించింది ఒక్క వీడియో. సెప్టెంబర్ 9న ప్రసారమైన ఆ ఎపిసోడ్ బిగ్ బాస్ 20 ఏళ్ల ప్రయాణాన్ని ఒక వీడియో ద్వారా చూపించింది. తమ ప్రత్యేకమైన వ్యక్తిత్వాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఎందరో ప్రముఖ కంటెస్టెంట్ల తాలూకు కొన్ని దృశ్యాలను ఇందులో చూపించారు. ఈ లెగసీ వీడియోలో…

Read More

అరుణాచల్‌లో అరుదైన హిమాలయన్ చేపను కనిపెట్టిన శాస్త్రవేత్తలు! దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడూ కొత్త ఆవిష్కరణలు, కొత్త విషయాలను కనిపెడుతూ ఉంటారు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని భీమ్‌తాల్‌కు చెందిన ICAR-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోల్డ్‌వాటర్ ఫిషరీస్ రీసెర్చ్ టీం, అరుణాచల్ మత్స్యశాఖ సహాయంలో ఓ అరుదైన హిమాలయన్ చేపను కనిపెట్టారు. ఇది ఎక్కువగా తవాంగ్ జిల్లాలో ఉన్న ఎత్తైన పర్వత సరస్సులో నివసిస్తోందని తెలిపారు. ఈ అరుదైన హిమాలయన్ చేపను మన దేశంలో గుర్తించడం ఇదే తొలిసారని.. దీంతో భారతదేశ మంచినీటి జీవవైవిధ్య జాబితాలోకి మరో కొత్త జాతి చేరిందని…

Read More

Gold Prices: బంగారం ధరలు మళ్లీ డౌన్.. కొనుగోలుచేసేవారికి భారీ ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో శనివారం తులం ఎంతంటే..?

బంగారం ధరలు మరోసారి తగ్గుముఖ పట్టాయి. శుక్రవారం రూ.2500కిపైగా తగ్గగా.. శనివారం కూడా మరోసారి పడిపోయాయి. దీంతో పండుగల సీజన్ క్రమంలో గోల్డ్ కొనుగోలుచేసేవారు ఊరట చెందుతున్నారు. డాలర్ బలపడటం, యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై అంచనాలు పెరుగుతుండంతో గోల్డ్ రేట్లు ప్రభావితం అవుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు చెప్పలేమని అంటున్నారు. సెప్టెంబర్ 12న దేశంలోని వివిధ నగరాల్లో బంగారంతో పాటు వెండి ధరలు ఎలా…

Read More

గ్యాస్, ఎసిడిటీ ఇక చిటికెలో మాయం.. పడుకునే ముందు ఇవి 2 తింటే చాలు..

మన వంటింట్లో సుగంధ ద్రవ్యాల రాణిగా పిలిచే యాలకులు కేవలం వంటకాలకు రుచి, సువాసన ఇవ్వడానికే పరిమితం కాదు.. అవి శరీరానికి సంజీవనిలా పనిచేసే అద్భుత ఔషధ గుణాల గని. ప్రతి రాత్రి పడుకునే ముందు కేవలం ఒకటి లేదా రెండు యాలకుల కాయలను నమిలి, ఆపై గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ సాబో సూర్య ప్రకాష్ స్పష్టం చేస్తున్నారు. యాలకులలో ఉండే శక్తివంతమైన…

Read More

Prasad Thota: తెలుగు టెక్నీషియన్లకు అక్కడ మంచి గౌరవం ఉంటుంది: రచయిత తోట ప్రసాద్

ప్రముఖ రచయిత తోట ప్రసాద్ స్టోరీ రైటర్, డైలాగ్ రైటర్ల బాధ్యతలు, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని రచయితల పనితీరు, ప్యాషన్, సహకారం వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒక స్టోరీ రైటర్ డైలాగ్ రైటర్‌గా మారగలరని ఆయన నొక్కి చెప్పారు. ఎందుకంటే కథలోని ముఖ్యమైన సంభాషణలు సన్నివేశాల నుంచే సహజంగా పుడతాయని ఆయన అన్నారు. కానీ కేవలం డైలాగ్స్‌పైనే దృష్టి సారించి, కథపై అవగాహన లేని డైలాగ్ రైటర్ స్టోరీ…

Read More

ముక్కు, చెవులు కొత్తగా కుట్టించుకున్నారా? ఇన్ఫెక్షన్లు రాకుండా పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు!

ముక్కు, చెవులు కుట్టించుకోవడం మన సాంప్రదాయంలో ఒక భాగం. అయితే, కొత్తగా కుట్టించుకున్న తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇన్ఫెక్షన్లు, వాపు, తీవ్రమైన నొప్పి వచ్చే అవకాశం ఉంది. చెవి లేదా ముక్కు కుట్టించుకున్న తర్వాత ఆ ప్రదేశాన్ని పదే పదే ముట్టుకోకుండా ఉండటం ఎంతో ముఖ్యం. అంతేకాదు.. కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకుంటే.. ఆ గాయం త్వరగా మానిపోతుంది..ఆ వివరాల్లోకి వెళితే.. చేతులతో పదే పదే ముట్టుకోకూడదు కొత్తగా కుట్టించుకున్న తర్వాత చాలామంది…

Read More

ఆ హీరో అంటే నాకు పిచ్చి ఇష్టం.. ఆ సినిమాలో ఆయను చూసి ఫిదా అయిపోయా : నటి హేమ

ప్రముఖ నటి హేమ, తన సినీ ప్రస్థానంలో ఎదురైన మధురానుభూతులను, ముఖ్యంగా అక్కినేని నాగార్జున పట్ల తనకున్న అపారమైన అభిమానాన్ని, గౌరవాన్ని పంచుకున్నారు. తన ఇంటి పక్కన ఉన్న స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నాగార్జున షూటింగ్ చేస్తున్నప్పుడు, ఆయనను భోజనానికి ఆహ్వానించిన అరుదైన సంఘటనను హేమ గుర్తుచేసుకున్నారు. లంచ్‌కు రాలేనని చెప్పినప్పటికీ, పది నిమిషాలు తన ఇంటికి వస్తానని నాగార్జున హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హేమ, తన సహాయకుడైన చంద్ర సహాయంతో, నాగార్జునకు ఇష్టమైన చాపల…

Read More