ట్రాన్స్జెండర్లకు సర్కార్ గుడ్న్యూస్.. మున్సిపల్ కార్పొరేషన్లలో కో-ఆప్షన్ సభ్యులుగా నియామకం
హైదరాబాద్: రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం కీలక అవకాశం కల్పించనుంది. రాష్ట్రంలో క్యూర్ పరిధికి వెలుపల ఉన్న 9 మున్సిపల్ కార్పొరేషన్లలో కో-ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్జెండర్లను నియమించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు శాసనసభలో వెల్లడించారు. స్థానిక సంస్థల్లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ట్రాన్స్జెండర్ సమాజానికి కూడా మున్సిపల్ పాలనలో భాగస్వామ్యం కల్పించేందుకు కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. దీంతో…
