భారత్ నుంచి తెచ్చిన 30 ముంగిసలు వేలుగా పెరిగాయి.. చివరికి జపాన్లో ఏం జరిగిందంటే?
టోక్యో: విషపూరిత పాములు, ఎలుకల నియంత్రణ కోసం తీసుకున్న ఓ ప్రయోగం చివరకు మరో పర్యావరణ సంక్షోభానికి దారితీసింది. 1979లో జపాన్లోని అమామి ఓషిమా ద్వీపంలో సుమారు 30 చిన్న భారతీయ ముంగిసలను ప్రవేశపెట్టారు. అయితే అవి అనుకున్న హబు పాములు, ఎలుకలను నియంత్రించకపోగా.. ద్వీపంలోని అరుదైన స్థానిక జంతువులను వేటాడటం ప్రారంభించాయి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగిన నిర్మూలన చర్యల అనంతరం 2024లో ఆ ముంగిసలు ద్వీపం నుంచి పూర్తిగా అంతరించిపోయినట్లు జపాన్ ప్రభుత్వం…
