Telangana: కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. బరిలో ఉండేది వీళ్లే!
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి అప్పుడే స్టార్ట్ అయింది. రాష్ట్రంలో త్వరలో ఖాళీ అవ్వబోతున్న 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ప్రతిష్ఠాత్మకమైన మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డిని అధిష్ఠానం ఖరారు చేసింది. అలాగే, నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సర్వోత్తం రెడ్డికి అవకాశం కల్పించింది. అయితే ఈ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు గాను మొత్తం ఆరుగురి అభ్యర్థుల పేర్లను…
