ఉల్లిపాయల ధరలకు కళ్లెం.. ఏపీలో రూ.35కే కిలో
ఉల్లిపాయల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. రైతు బజార్లలో సబ్సిడీపై కిలో ఉల్లిపాయలను కేవలం రూ.35కే విక్రయించాలని నిర్ణయించింది. తొలిదశలో విజయవాడలోని అన్ని రైతు బజార్లలో ఈ విక్రయాలను ప్రారంభించనుంది. కుటుంబానికి నెలకు 2 కిలోలు రేపటి నుంచి విజయవాడలో సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలు అందుబాటులోకి రానున్నాయి. ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు గరిష్ఠంగా రెండు కిలోల ఉల్లిపాయలను రూ.35…
