Cinema : బాలకృష్ణ డైరెక్టర్.. ఉదయ్ కిరణ్, సౌందర్య కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా..
నందమూరి బాలకృష్ణ హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా చేశారని మీకు తెలుసా.. ? అవును.. తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’ను అదే పేరుతో రీమేక్ చేయాలని సంకల్పించారు. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా కూడా పరిచయం కావాలనుకున్నారు. 2004లో అత్యంత వైభవంగా ఈ చిత్రం ప్రారంభమైంది. ఇందులో బాలకృష్ణ అర్జునుడు, బృహన్నల, కీచకుడు వంటి మూడు భిన్నమైన పాత్రల్లో నటించాల్సి ఉంది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన ద్రౌపది పాత్ర కోసం…
