బుల్లితెర నటీనటులు ఏక్నాథ్, జయ హారిక దంపతుల గురించి చెప్పక్కర్లేదు. తెలుగులో పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు వీరిద్దరు తమ కొత్త జీవితంలోకి మరో అడుగు వేశారు. ఇప్పుడు ఇద్దరూ ఓ ఇంటివారయ్యారు. ఎన్నో కలలతో తమమ స్వగృహాన్ని నిర్మించుకుని, ఇటీవల అత్యంత వైభవంగా గృహప్రవేశం చేశారు. సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన అందమైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు, తోటి నటీనటులు ఈ క్రేజీ కపుల్‌కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలుగు బుల్లితెరపై నటుడిగా ఏక్నాథ్, నటిగా జయ హారిక తమదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఇరువరు బాగా సుపరిచితులు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట, ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒక అందమైన ఇల్లును నిర్మించుకుని, ఆ కొత్తింటిలోకి భార్యాభర్తలిద్దరూ సంతోషంగా అడుగుపెట్టారు.
ఎక్కువ మంది చదివినవి : Pawan Kalyan : కాలినడకన తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి.. పవర్ స్టార్ ఆరోగ్యం కోసం అలిపిరి మెట్లెక్కిన అన్నా..
ఈ గృహప్రవేశ వేడుకలో ఏక్నాథ్, జయ హారిక సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోయారు. హారిక పట్టుచీరలో ఎంతో అందంగా కనిపించగా, ఏక్నాథ్ ట్రెడిషనల్ పంచెకట్టులో క్లాస్ లుక్‌తో ఆకట్టుకున్నారు. కొత్త ఇంట్లో పాలు పొంగించడం, సత్యనారాయణ స్వామి వ్రతం , హోమం వంటి సాంప్రదాయ పూజా కార్యక్రమాలను ఈ దంపతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకకు వారి కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు , బుల్లితెరకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. నూతన గృహంలో అడుగుపెట్టిన ఈ జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం తమ కొత్తి గృహ ప్రవేశ వేడుకకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Cinema : 6 కోట్లతో తీస్తే రూ.16 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా..
ఈ గృహప్రవేశానికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. “మీ కొత్త ఇల్లు ఎంతో అందంగా ఉంది”, “నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు”, “ఈ ఇంట్లో మీరు మరిన్ని విజయాలు అందుకోవాలి” అంటూ అభిమానులు తమ ప్రేమను కురిపిస్తున్నారు. ఎంతో ఆనందంగా, చిరునవ్వులతో ఉన్న ఈ దంపతుల ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..
ఏక్నాథ్, జయ హారిక గృహప్రవేశం వీడియో..
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
