వార్ ఎఫెక్ట్.. సిలిండర్‌లో ఇక 10 కేజీల గ్యాసేనా ??
భారతదేశంలో గ్యాస్ కొరత పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. గ్యాస్ దిగుమతులకు కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల కారణంగా దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఒక వినూత్న వ్యూహాన్ని పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం సరఫరా చేస్తున్న 14.2 కిలోల సిలిండర్ బరువును 10 కిలోలకు తగ్గించాలని యోచిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. భారతదేశం తన అవసరాల కోసం…
