తాజావార్తలు

IND vs ZIM: లైవ్ కోసం యాప్‌లకు డబ్బులు వేస్ట్ చేసుకోకండి.. ఫ్రీగా ఎలా చూడాలో తెలుసుకోండి!

IND vs ZIM: లైవ్ కోసం యాప్‌లకు డబ్బులు వేస్ట్ చేసుకోకండి.. ఫ్రీగా ఎలా చూడాలో తెలుసుకోండి!


టీమిండియా వర్సెస్ జింబాబ్వే మూడు టీ20ల సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం 4.30 గంటలకు తొలి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ నెల 25, 26 తేదీల్లో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మూడు మ్యాచ్‌లు హరారే వేదికగానే జరగనున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లో వరుస ఓటముల తర్వాత యంగ్ టీమిండియా జింబాబ్వేతో తలపడనుంది. ఆ ఓటములను మర్చిపోయి.. తిరిగి విన్నింగ్ ట్రాక్ ఎక్కాలని శ్రేయస్ అయ్యర్ సేన గట్టి పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లు జియో, స్టార్ స్పోర్ట్స్, సోని లివ్ వంటి వాటిలో లైవ్ టెలికాస్ట్ కావడం లేదు.

దీంతో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌లు ఎలా చూడాలని కంగారు పడుతున్నారు. స్టార్ స్పోర్ట్స్, సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లలో మ్యాచ్‌లు ప్రసారం కావు. అలాగే జియోహాట్‌స్టార్, సోనీ లివ్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉండదు. మరి ఎలా అంటే.. ఈ మూడు మ్యాచ్‌లను అభిమానులు ఫ్యాన్‌కోడ్ (FanCode) ప్లాట్‌ఫామ్‌లో మాత్రమే లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించాల్సి ఉంటుంది. అందులో చూడాలంటే రూ.35 లతో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. కానీ, ఇవి కూడా చెల్లించకుండా ఫ్రీగా మ్యాచ్ లైవ్ చూడాలంటే.. ప్రభుత్వ సంస్థ దూరదర్శన్ లో డీడీ స్పోర్ట్స్ ఛానెల్‌లో లైవ్ ఫ్రీగా చూడొచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *