సెల్‌ఫోన్ పాస్‌వర్డ్ చెప్పలేదని దారుణ హత్య.. కర్రలతో తలపై దాడి చేసి మర్డర్
చేవెళ్ల, అక్టోబర్ 9: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ పాస్‌వర్డ్ చెప్పేందుకు నిరాకరించాడన్న కోపంతో ఓ వ్యక్తిని దుండగులు హత్య చేశారు. అనంతరం ఫోన్‌ను మంటల్లో పడేశారు. చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో చేవెళ్ల బస్‌స్టాండ్ వద్ద 43 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి నుంచి కొందరు దుండగులు సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. అనంతరం అతడిని…
