తాజావార్తలు

Video: 10 ఫోర్లు, 12 సిక్సర్లు.. 51 బంతుల్లో కాటేరమ్మ కొడుకు దూల తీర్చిన నయా సెన్సేషన్..!

Anmolpreet Singh Century: షేర్‌-ఎ-పంజాబ్‌ టీ20 లీగ్‌-2026 తొలి మ్యాచ్‌లోనే పరుగుల వరద పారింది. అమృత్‌సర్‌ సూర్మాస్‌, మొహాలీ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 520 పరుగులు నమోదయ్యాయి. భారత యువ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ 26 బంతుల్లో 77 పరుగులతో మెరుపులు మెరిపించినా.. అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ విధ్వంసక శతకంతో మొహాలీ కింగ్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 51 బంతుల్లో 133 పరుగులు..! 259 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మొహాలీ…

Read More

నీట్ ఎగ్జామ్‌కు వచ్చిన విద్యార్థి.. ఒక్కసారిగా గుప్పుమన్న వాసన.. అనుమానంతో చూడగా..

దేశవ్యాప్తంగా NEET PG ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 2,73,183 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. సుమారు 1,300 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహించారు. తెలంగాణలోనూ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 17,627 మంది దరఖాస్తు చేసుకోగా.. 56 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. అయితే రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఓ విద్యార్థి వ్యవహారం కాసేపు హాట్‌టాపిక్‌గా మారింది. శేరిగూడలోని పరీక్షా కేంద్రానికి ఓ విద్యార్థి మద్యం తాగి నీట్ పీజీ ఎంట్రన్స్…

Read More

Cinema : అందమైన అమ్మాయి అని ఆట పట్టిస్తే తాట తీస్తుంది.. ఓటీటీలో కుర్రాళ్లు తెగ చూస్తున్న సినిమా.. ట్రెండింగ్‏లో టాప్..

ఇటీవల, ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలయ్యాయి. వీటిలో ఒక సినిమా నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. యాక్షన్, సస్పెన్స్‌తో నిండిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. 2 గంటల 21 నిమిషాల నిడివి గల ఈ సినిమా, రితేష్ దేశ్‌ముఖ్ ‘రాజా శివాజీ’ , అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ చిత్రాలను కూడా అధిగమించింది. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న సినిమా పేరు ‘బ్లాస్ట్’. ఇది తమిళ భాషలో…

Read More

Team India: ఇకపై నో బాల్స్ వేస్తే జేబుకు చిల్లే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..!

Gavaskar Calls for Financial Penalties on Bowlers and Coaches for Repeated No-Balls: టెస్ట్ క్రికెట్‌లో బౌలర్లు పదేపదే నో బాల్స్ వేయడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రస్తుత “ఫ్రీ హిట్” విధానం సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి బదులుగా, నో బాల్ చేసిన బౌలర్‌తో పాటు ఆ జట్టు బౌలింగ్ కోచ్ పైన కూడా ఆర్థిక జరిమానా విధించాలనే వినూత్న ప్రతిపాదనను…

Read More

కథ చెప్పినప్పుడు బాగా నవ్వుకున్నా.. నేను ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు: సందీప్ రెడ్డి

భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు, ప్రొడ్యూసర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ – డైరెక్టర్ వేణుగోపాల్ ఈ కథ చెప్పినప్పుడు బాగా నవ్వుకున్నా. అయితే కథ చెప్పినంత…

Read More

తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనీ.. భార్యను చంపి సెప్టిక్ ట్యాంక్‌లో పాతిపెట్టాడు! అనాథలైన నలుగురు పిల్లలు

ధెంకనాల్, ఆగస్ట్‌ 30: గిరీష్, అతని భార్య శుక్రవారం సుభద్ర యోజన పథకం కింద జమ అయిన డబ్బులను తీసుకునేందుకు వెళ్లారు. అనంతరం ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మద్యం కొనుగోలు చేసేందుకు తన భార్య వద్ద ఉన్న డబ్బులు ఇవ్వాలని గిరీష్ అడిగినట్లు సమాచారం. అయితే ఆమె డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన గిరీష్ కర్రతో భార్యపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ…

Read More

కోహ్లీ కొత్త టాటూ.. అర్థం ఏంటో తెలుసా? వైరల్ అవుతున్న డిజైన్‌ వెనుక..

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన కొత్త టాటూతో అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఆయన ఎడమ చేతిపై కనిపిస్తున్న కొత్త టాటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుండ్రంగా ఉండి, మధ్య నుంచి అలల మాదిరిగా బయటకు విస్తరిస్తున్న ఈ డిజైన్‌ను చూసి.. దీని వెనుక ఉన్న అర్థం ఏమిటనే చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం, కోహ్లీ కొత్త టాటూ ఆయన కొనసాగిస్తున్న ఫుల్-స్లీవ్ టాటూ ప్రాజెక్ట్‌లో భాగం. అయితే ఈ…

Read More

India Women vs Thailand Women: థాయ్‌లాండ్‌కు 160 పరుగుల టార్గెట్ ఇచ్చిన టీమిండియా

2026 మహిళల ఆసియా కప్‌లో భాగంగా ఆగస్టు 30న భారత్, థాయ్‌లాండ్ మహిళల జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు థాయ్‌లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ కీలక పరుగులు సాధించారు. అయితే వరుస వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు చేయలేకపోయారు. చివర్లో బ్యాటర్లు వేగంగా…

Read More

ములుగు జిల్లాలో విషాదం.. రాఖీ పండుగకు వచ్చి అన్నదమ్ముల మృతి

ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో జారిపడి ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి. స్థానికుల కథనం ప్రకారం.. మంగపేట మండలం కమలాపూర్‌కు చెందిన మాలోతు యాకూబ్, స్వాతి దంపతులకు వినయ్ కిశోర్ (16), రాజేశ్ (14) ఇద్దరు కుమారులు ఉన్నారు. వినయ్ కిశోర్ ఇంటర్, రాజేశ్ పదో తరగతి చదువుతున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా…

Read More

Om-Shaped Temple: ప్రపంచంలోనే తొలి ఓం ఆకార ఆలయం ఇదే.. 1,008 శివ విగ్రహాల అద్భుతం!

Om Aakar Temple Rajasthan: రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో ఉన్న జాదన్ గ్రామం ఆధ్యాత్మికత, అద్భుతమైన నిర్మాణశైలికి ప్రసిద్ధి చెందుతోంది. ఇక్కడ కొలువుదీరిన ఓం ఆకార ఆలయం (Om Aakar Temple) ప్రపంచంలోనే తొలి ఓం ఆకారంలో నిర్మించిన ఆలయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. హిందూ తత్వశాస్త్రంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే ‘ఓం’ విశ్వం, సృష్టి, చైతన్యానికి ప్రతీకగా భావిస్తారు. ఈ విశ్వ నాదాన్ని రాతి నిర్మాణంగా ఆవిష్కరించినట్టుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. 250 ఎకరాల్లో విస్తరించిన…

Read More