తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు.. 1931 హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు కీలక అప్డేట్
హైదరాబాద్, సెప్టెంబర్ 1: మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టులకు పోటీ పడిన అభ్యర్థుల్లో మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ ప్రక్రియ చేపట్టారు. ప్రతి పోస్టుకు 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపిక చేసినట్లు MHSRB తెలిపింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల కావడంతో నియామక ప్రక్రియ మరో కీలక దశలోకి ప్రవేశించింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులు ఇక సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్‌లో సమర్పించే ధ్రువపత్రాల ఆధారంగా అర్హతలను…
