పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
చాలామంది చర్మ సంరక్షణలో భాగంగా ముఖం, జుట్టు, చేతులపై చూపించే శ్రద్ధను పాదాలపై పెట్టరు. రోజంతా శరీర భారాన్ని మోసే పాదాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మడమలు పొడిబారి, పగుళ్లు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా పండుగలు, శుభకార్యాల వేళ అందమైన దుస్తులు ధరించినప్పుడు ఈ పగిలిన మడమలు ఇబ్బందికరంగా మారుతుంటాయి. ఇది కేవలం బాహ్య సౌందర్యానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పగుళ్లు తీవ్రమై తీవ్రమైన నొప్పి, మంట, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లకు దారితీసే…
