పాఠశాలలో దొంగలు పడ్డారు.. ల్యాప్‌టాప్, టాబ్లెట్‌లను వదిలి ఏం ఎత్తుకెళ్లారో తెలుసా?
జార్ఖండ్‌లోని సెరైకేలా-ఖర్సవాన్ జిల్లాలోని పిట్కిలోని మాధ్యమిక పాఠశాలలో దొంగతనం కలకలం రేపింది. దొంగలు పాఠశాల ప్రధాన ద్వారం, కార్యాలయం, వంటగది తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అయితే కార్యాలయంలో ఉన్న ల్యాప్‌టాప్, టాబ్లెట్, మ్యూజిక్ సిస్టమ్ వంటి విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ముట్టుకోకుండా వదిలేశారు. ప్రధానంగా మధ్యాహ్న భోజన వంటగదినే లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం (అక్టోబర్ 07) ఉదయం ఉపాధ్యాయురాలు ఒలివ్ ధన్వార్ పాఠశాలకు చేరుకున్నప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాన ద్వారం…
