తాజావార్తలు

Asian Games: ఆసియా గేమ్స్ ఫైనల్‌ వర్షంతో రద్దైతే.. గోల్డ్ మెడల్ ఎవరికి..?

Asian Games Cricket Final: ఆసియా గేమ్స్ 2026 పురుషుల క్రికెట్‌లో వర్షం కారణంగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు రద్దవుతున్నాయి. భారత క్రికెట్ జట్టు (Team India), పాకిస్థాన్ క్రికెట్ జట్టు (Pakistan) తమ తమ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడకుండానే సెమీఫైనల్‌కు చేరాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ర్యాంకింగ్ ఆధారంగా ఇచ్చిన సీడింగ్ ఇక్కడ కీలకంగా మారింది. మెరుగైన సీడింగ్ ఉన్న జట్టుకు తదుపరి దశకు వెళ్లే అవకాశం లభిస్తోంది. దీంతో సెమీఫైనల్‌లోనూ వర్షం…

Read More

బ్రెడ్, జామ్ తిన్న తర్వాత విషాదం.. తండ్రి మృతి, ఇద్దరు కుమార్తెలకు అస్వస్థత!

కేరళలోని త్రిశూర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో బ్రెడ్, జామ్ తిన్న కొద్దిసేపటికే అస్వస్థతకు గురైన 60 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనతో కలిసి అదే ఆహారం తీసుకున్న ఇద్దరు కుమార్తెలు కూడా అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిశూర్ జిల్లా పళయన్నూర్ ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్ శనివారం (సెప్టెంబర్ 26)…

Read More

Watch: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త రూట్ దొరికిందా..? స్కూటీతో ఫుట్‌బ్రిడ్జ్ ఎక్కేసిన యువతి!

సాధారణంగా ఫుట్ ఓవర్‌బ్రిడ్జ్ అంటే పాదచారులు రోడ్డు దాటేందుకు ఉపయోగించే మార్గం. మెట్లు లేదా ర్యాంప్ ద్వారా పైకి వెళ్లి.. అవతలి వైపునకు నడుచుకుంటూ చేరుతుంటారు. అయితే ఓ మహిళ మాత్రం ఫుట్ ఓవర్‌బ్రిడ్జ్‌ను ఏకంగా స్కూటర్‌తో దాటేందుకు ప్రయత్నించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ స్కూటర్‌పై ఫుట్ ఓవర్‌బ్రిడ్జ్‌ వద్దకు చేరుకోవడం కనిపించింది. అక్కడ సాధారణంగా పాదచారులు…

Read More

సోషల్ మీడియాలో విషాదం.. ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి తివారీ ఆత్మహత్య! కారణమేంటి?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీ జిల్లాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి తివారీ (30) అనుమానాస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు వివిధ సోషల్ మీడియా వేదికలపై లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న నిధి, తన నివాసంలోనే ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. పోలీసులు తెలిపిన…

Read More

Viral Video: వరదలో కొట్టుకొచ్చిన మద్యం బాటిల్స్.. ఇది కదా అసలైన రిలీఫ్ ప్యాకేజీ అంటున్న నెటిజన్స్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, రోడ్లపై ఉధృతంగా పారుతున్న వరద నీటిలో పెద్ద సంఖ్యలో మద్యం సీసాలు తేలియాడుతూ కొట్టుకురావడం కనిపిస్తుంది. నీటిపై తేలుతున్న బాటిళ్లను చూసిన కొందరు స్థానికులు, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నీటిలోకి దిగారు. వరద నీటి నుంచి ఆ మద్యం సీసాలను సేకరించడానికి ఒకరినొకరు నెట్టుకుంటూ పట్టుకునేందుకు ఆరాటపడ్డారు. అత్యంత విలువైన నిధి దొరికినట్లుగా వారు ఆ బాటిళ్లను భద్రంగా పట్టుకుని వెళ్లడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది….

Read More

నాని ప్యారడైజ్ మూవీపై కేటీఆర్ కామెంట్స్..శంకరన్న పాత్ర గురించి ఏం చెప్పారంటే?

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ద పారడైజ్ సినిమాను వీక్షించారు. పార్టీ నేతలతో కలిసి ఈ సినిమాను చూసేందుకు వెళ్లిన కేటీఆర్, పలు సంవత్సరాల తర్వాత థియేటర్‌లో సినిమా చూడబోతున్నానని మధ్యాహ్నమే ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. దీంతో థియేటర్ వద్ద అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. సినిమా చూసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ద పారడైజ్ చాలా…

Read More

22ఏ భూముల చిక్కులకు పరిష్కారం.. ULC కాలనీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వం అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (ULC) భూముల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 15 వేల దరఖాస్తులను పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో 15 వేలకు పైగా కుటుంబాలకు తమ భూములపై పూర్తి హక్కులు లభించనున్నాయి. ముఖ్యంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్‌ 22ఏ సమస్యలను పరిష్కరిస్తూ, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వేగంగా క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టింది. ఇది లక్షలాది మందికి ఆస్తి హక్కులను సురక్షితం చేస్తుంది. తెలంగాణలో అర్బన్‌ ల్యాండ్‌…

Read More

వాళ్ళకోసం నేను పెళ్లి చేసుకోవాలా.? టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంజలి. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమర్షియల్ సినిమాలతో పాటు విభిన్నమైన కథలు, పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది అంజలి. కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే వ్యక్తిగత విషయాల్లో మాత్రం పెద్దగా స్పందించని అంజలి.. ముఖ్యంగా తన పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంది. అంజలి వయసు 40 దాటడంతో…

Read More

BiggBoss 10: బిగ్ బాస్ హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..! సరిపోయారు ఇద్దరూ..!!

బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో ఆదివారం ఎపిసోడ్ అనూహ్య మలుపులతో సాగింది. ఒకవైపు మిథిలేష్ ఎలిమినేషన్‌పై ఇంటి సభ్యుల మధ్య తీవ్ర చర్చ జరగగా.. మరోవైపు చివరి నిమిషంలో ముఖేష్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా వర్షిణి, వంశీని సేవ్ చేయడానికి ముఖేష్ తన కెప్టెన్సీతో పాటు ఇమ్యూనిటీని కూడా వదులుకోవడం ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఆదివారం ఎపిసోడ్‌లో మిథిలేష్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. అయితే అతడు రూ.15 లక్షలతో బయటకు…

Read More

ఏషియన్ గేమ్స్‌లో నేడు భారత్‌ షెడ్యూల్ ఇదే.. క్రికెట్‌తో పాటు అథ్లెటిక్స్‌పై ఫోకస్..!

India vs Afghanistan quarterfinal: ఏషియన్ గేమ్స్ 2026 (Asian Games 2026)లో భారత్‌కు సెప్టెంబర్ 28 మరో కీలక రోజు. ఎనిమిదో రోజు ముగిసే సమయానికి భారత ఖాతాలో 37 పతకాలు ఉన్నాయి. తొమ్మిదో రోజు ఈ సంఖ్యను పెంచే అవకాశాలు పలు క్రీడల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత క్రికెట్ జట్టు (Team India) పురుషుల విభాగంలో తన పోరాటాన్ని ప్రారంభించనుంది. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నాయకత్వంలోని జట్టు అఫ్గానిస్థాన్ (Afghanistan)తో క్వార్టర్‌ఫైనల్ ఆడుతుంది….

Read More