తాజావార్తలు

Central Governemnt: కేవలం రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షలు అకౌంట్లోకి.. కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. మీరూ చేరవచ్చు..

కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. సేవింగ్స్ స్కీములతో పాటు బీమా పథకాలను కూడా అమలు చేస్తోంది. తక్కువ ప్రీమియంతో పాటు పెద్ద మొత్తంలో బీమా అందించే పథకం ఒకటి ఉంది. అదే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబానికి బీమా సొమ్ము లభిస్తుంది. ఈ పథకంలో చేరేందుకు ఎలాంటి మెడికల్ టెస్టులు కూడా అవసరం లేదు. జస్ట్ ఏడాదికి రూ.20 ప్రీమియం చెల్లిస్తే చాలు.. ఏకంగా రూ.2 లక్షల బీమా…

Read More

తొలి బంతికే గోల్డెన్ డక్.. వన్డేల్లో రీఎంట్రీతో చెత్త రికార్డ్.. ఎవరంటే..?

Aiden Markram Golden Duck: దక్షిణాఫ్రికా (South Africa), ఆస్ట్రేలియా (Australia) మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఎయిడెన్ మార్క్రమ్ (Aiden Markram) రీఎంట్రీ చేదు అనుభవంగా మారింది. జోహన్నెస్‌బర్గ్‌లో సెప్టెంబర్ 27న జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. డిసెంబర్ 2025 తరువాత వన్డే జట్టులోకి తిరిగి వచ్చిన మార్క్రమ్‌పై అందరి దృష్టి ఉంది. కానీ అతడు క్రీజులో నిలిచే అవకాశం కూడా రాలేదు. జోష్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood) వేసిన తొలి బంతినే…

Read More

NEET UG కౌన్సెలింగ్‌లో ఆ 37 మందికి చుక్కెదురు.. MBBS, BDS సీట్లు రద్దు!

హైదరాబాద్, సెప్టెంబర్ 27: నీట్‌ యూజీ-2026లో ఎస్టీ (Scheduled Tribe) రిజర్వేషన్‌ కింద అర్హత పొందిన 37 మంది అభ్యర్థులు వాస్తవానికి ఆ కేటగిరీకి చెందరని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఈ మేరకు సెప్టెంబరు 26న వర్సిటీ ప్రకటన విడుదల చేసింది. గిరిజన సంక్షేమశాఖ నిర్వహించిన పరిశీలనలో ఈ 37 మంది అభ్యర్థులను ఎస్టీయేతరులుగా గుర్తించినట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. దీంతో ఎస్టీ రిజర్వేషన్‌ కింద ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లు పొందేందుకు వారు అర్హులు…

Read More

ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..!

న్యూఢిల్లీ: దేశంలోని ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు సంబంధించిన ఓ కీలక అంశంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిర్ణయం తీసుకుంది. 28 రోజుల వ్యాలిడిటీతో ఉండే రీఛార్జ్ ప్లాన్లకు ప్రత్యామ్నాయంగా 30 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలవ్యవధి కలిగిన వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం సంస్థలకు ఆదేశించింది. TRAI ఈ మేరకు టెలికాం వినియోగదారుల రక్షణ (13వ సవరణ) నిబంధనలు, 2026ను సెప్టెంబర్ 22న జారీ చేసింది. ఈ అంశాన్ని…

Read More

Pesara Kattu: నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా.. శరీరానికి చలువ చేసే కమ్మటి పెసర కట్టు

కావలసిన పదార్థాలు: 1 చిన్న కప్పు పెసరపప్పు, సుమారు 80 గ్రాములు, సన్నగా కట్ 1 ఇంచ్ అల్లం తరుగు, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, పప్పు ఉడికించడానికి 1 పెద్ద గ్లాసు నీళ్లు ఆ తర్వాత కలపడానికి మరో 1 గ్లాసు నీళ్లు, కావాలనుకుంటే చల్లారాక వేసుకోవడానికి కొద్దిగా నిమ్మరసం . ఘుమఘుమలాడే తాలింపు కోసం: 1-2 చెంచాలు నూనె, 7-8 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు , అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు, 3 తుంచిన ఎండుమిర్చి, తాజా కరివేపాకు తయారీ విధానం: ఒక చిన్న కప్పు (80 గ్రాములు) పెసరపప్పును తీసుకుని నీటితో రెండు సార్లు శుభ్రంగా…

Read More

ఇంట్లో దోమల బెడదతో విసుగు చెందారా? 4 కుండీల్లో ఈ గడ్డిని పెంచారంటే ఈజీగా చెక్‌ పెట్టొచ్చు..!

ఇంట్లో దోమల బెడదను తగ్గించడానికి రసాయనాలతో కూడిన కాయిల్స్ లేదా లిక్విడ్‌లకు బదులుగా ఇంట్లోనే సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం ఎంతో శ్రేయస్కరం. వాటిలో లెమన్ గ్రాస్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. లెమన్ గ్రాస్‌లో ఉండే తీవ్రమైన సువాసన దోమలను ఇంట్లోకి రాకుండా తరిమికొడుతుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా దోమలను నివారించడానికి ఇదొక సురక్షితమైన మార్గం. లెమన్ గ్రాస్ దోమలను ఎలా నివారిస్తుంది? లేమన్ గ్రాస్‌లో సిట్రోనెల్లా అనే సహజమైన నూనె సమ్మేళనం ఉంటుంది. దీని నుండి…

Read More

నది ఉధృతిలో కొట్టుకుపోయిన ఏనుగు పిల్ల.. ప్రాణాలకు తెగించి రక్షించిన మత్స్యకారులు..

తీస్తా నది ఉధృత ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక ఏనుగు పిల్లను స్థానిక మత్స్యకారులు చాకచక్యంగా రక్షించిన హృదయ విదారక సంఘటన నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. నది దాటుతున్న సమయంలో ప్రవాహ హోరుకు తన గుంపు నుండి విడిపోయిన ఆ ఏనుగు పిల్ల కొట్టుకుపోతుండగా, ప్రాణాలకు తెగించి మత్స్యకారులు దానిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అడవి గుండా ప్రవహించే తీస్తా నదిని దాటేందుకు ఏనుగుల గుంపు ప్రయత్నించింది. ఆ సమయంలో నదిలో నీటి ఉధృతి చాలా ఎక్కువగా…

Read More

రూ.10 వేల జీతం వివాదం.. రూ.24 కోట్ల ఆస్తి నష్టం.. టెక్స్‌టైల్ మిల్లు అగ్నిప్రమాదం వెనుక పక్కాప్లాన్ తెలిస్తే..!

గుజరాత్‌లోని సూరత్‌లో కేవలం రూ.10,000 జీతం బకాయి వివాదం ఏకంగా రూ.24 కోట్ల నష్టానికి దారితీసింది. టెక్స్‌టైల్ మిల్లు యజమాని తన జీతాన్ని సకాలంలో ఇవ్వలేదని ఆగ్రహించిన మాజీ ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా మిల్లుకు నిప్పు పెట్టాడు. ఈ ప్రమాదంలో భారీగా దాచి ఉంచిన వస్త్రాలు, విలువైన యంత్రాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. కేవలం చిన్న వివాదం వల్ల ఇంత పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరగడం, అనేకమంది ఉపాధి ప్రమాదంలో పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది….

Read More

ప్రకృతి పరమేశ్వరుడిని ఆరాధించే దృశ్యం.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే అనుభూతి..!

సైన్స్‌నా? దైవ రహస్యమా? లేక ప్రాచీన శిల్పకళా వైభవమా? ప్రకాశం జిల్లా అద్దంకిలో ఒక అరుదైన వింత ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని పరమశివుడిని ప్రత్యక్షంగా ఆదిత్యుడు పూజించాడు. చీకటి గర్భగుడిని చీల్చుకుంటూ వచ్చిన లేలేత సూర్యకిరణాలు.. నేరుగా ఆ నగేశ్వరుడి లింగాకృతిపై పడి బంగారు కాంతులీనాయి సూర్యుడే మొదటి పూజారిగా మారిన అద్భుత ఘట్టం ఇది. అద్దంకి పట్టణంలోని ప్రసిద్ధ వెయ్యి స్తంభాల గుడిగా పిలిచే శ్రీ గంగా వింధ్యవాసిని సమేత నాగేశ్వర స్వామివారి ఆలయం.. ఈ అపురూప…

Read More

Pradeep Advaitham: ‘ఛాంపియన్’ దర్శకుడి ఇంట తీవ్ర విషాదం.. చిన్న వయసులోనే భార్య హఠాన్మరణం.. ఏమైందంటే?

ప్రముఖ దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి, ప్రముఖ వ్యాపార వేత్త దీప్తి రెడ్డి మాడుగుల హఠాత్తుగా కన్నుమూశారు. . గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోన్న ఆమె శనివారం (సెప్టెంబర్ 27) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో దర్శకుడి తో పాటు అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు దీప్తి రెడ్డి హఠాన్మరణంతో సినీ, వ్యాపార వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆమె ఆత్మకు శాంతి…

Read More