ఏపీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ ఛాన్స్.. కానీ డబ్బులు అంత ఈజీగా రావు
సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని విస్తృతంగా చేరవేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అర్హత ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను అధికారికంగా ఎంప్యానెల్ చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం ‘సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ఎంప్యానెల్మెంట్ పాలసీ’కి ఆమోదం తెలిపింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి ప్లాట్ఫారమ్లలో యాక్టివ్గా ఉన్న క్రియేటర్లు ఈ విధానం కింద దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది….
