ఏపీలో 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు! పట్టణ కోటపై ఎవరి జెండా?
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే 87 మున్సిపాలిటీలు, ఇతర పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు పూర్తయింది. నవంబర్‌లో మరో 13 పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ…
