Cardamom Benefits: పచ్చ యాలకులు, నల్ల యాలకులు.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
భారతీయ వంటకాల్లో మసాలా దినుసులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులోనూ ‘యాలకులు’ అనగానే మనకు వెంటనే నోరూరించే స్వీట్లు, ఘుమఘుమలాడే బిర్యానీలు గుర్తుకు వస్తాయి. ఆహారానికి మంచి ఫ్లేవర్‌ను ఇవ్వడంలో యాలకులను మించిన సుగంధ ద్రవ్యం మరొకటి లేదు. అయితే యాలకుల్లో మనం ప్రధానంగా రెండు రకాలను చూస్తుంటాం. ఒకటి లేత ఆకుపచ్చ రంగులో ఉండే చిన్న యాలకులు (Green Cardamom), మరొకటి నలుపు లేదా ముదురు గోధుమ రంగులో ఉండే పెద్ద యాలకులు (Black Cardamom)….
