వామ్మో చూస్తేనే జడుసుకుంటారు! ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం.. వరంగల్‌కు ఎలా వచ్చిందబ్బా!
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో అరుదైన, అత్యంత విషపూరితమైన బాండెడ్ క్రేట్ పాము కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామ శివారులో నలుపు-పసుపు చారలతో ఉన్న ఈ పాము స్థానికుల కంటపడింది. సుమారు ఐదు అడుగుల పొడవున్న పామును చూసిన గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా సమీప అటవీ ప్రాంతంలో…
