నితిన్ నబిన్ కొత్త టీమ్ రెడీ.. పురందరేశ్వరీ, వసుంధర రాజేకు కీలక బాధ్యతలు..!
ఏడు నెలల తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తన కొత్త టీమ్‌ను ప్రకటించారు. పార్టీ భవిష్యత్ వ్యూహాలు, సంస్థాగత బలోపేతాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక పదవుల్లో మార్పులు, చేర్పులు చేశారు. కొత్త కార్యవర్గంలో పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించగా.. మరికొందరికి పదవులు కొనసాగించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా మొత్తం 13 మందిని నియమించారు. ఇందులో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్ మాధవ్, పురంధేశ్వరి…
