Hyderabad: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే.. ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్రమశిక్షణను మరింత కట్టుదిట్టం చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 12 నుంచి 18 వరకు నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఫ్రీ లెఫ్ట్‌ను అడ్డుకున్న 1,005 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. బిజీ జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన ఫ్రీ లెఫ్ట్ మార్గాలను కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా బ్లాక్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇలా చేయడం వల్ల…
