‘దయచేసి మా కుటుంబాన్ని వేధించొద్దు.. ఇక ఆపు’ కాకినాడ ఫ్యామిలీ సూసైడ్ కేసులో వెలుగులోకి సంచలనాలు
కాకినాడ, ఆగస్ట్ 21: కుటుంబ సమస్యలతో తీవ్ర మనోవేదనకు గురైన నూకరాజు.. సుమారు రెండు నెలల క్రితమే సాధిక్‌ఖాన్ ఇంటికి వెళ్లి తన కుటుంబాన్ని ఇకపై వేధించవద్దని వేడుకున్నట్లు సమాచారం. ‘ఇప్పటివరకు ఏం జరిగిందో జరిగింది.. ఇకపై మా కుటుంబాన్ని వేధించడం ఆపేయండి’ అని కోరినట్లు తెలుస్తోంది. సాధిక్ వల్ల తమ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా పోయిందని, తమ ఇంటివైపు రావద్దని అతడికి చెప్పాలని సాధిక్ తల్లినీ నూకరాజు బతిమాలినట్లు సమాచారం. ఆమె కూడా కుమారుడికి హితవు…
