మైసూరు దసరాలో చాముండేశ్వరి అమ్మవారికి ఎందుకంత ప్రాధాన్యత? మహిషాసురుడి సంహారం వెనుక పురాణ గాథ ఇదే!
Mysuru Dasara Story Telugu: మైసూరు దసరా అనగానే వేలాది దీపాలతో వెలిగిపోయే మైసూరు రాజప్రాసాదం, అలంకరించిన ఏనుగులు, బంగారు అంబారీలో కొలువుదీరే చాముండేశ్వరి అమ్మవారు గుర్తుకొస్తారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో దసరా పండుగను రావణ దహనంతో జరుపుకుంటే, కర్ణాటకలోని మైసూరులో మాత్రం మహిషాసురుడిపై చాముండేశ్వరి అమ్మవారు సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అందుకే మైసూరు దసరాకు ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఎంతో ప్రత్యేకత ఉంది. మహిషాసురుడిని సంహరించిన చాముండేశ్వరి అమ్మవారు స్థానిక పురాణ…
