Uppal: రాత్రి వేళ రోడ్డుపై అనుమానాస్పదంగా మహిళ.. ఏంటా అని ఆరా తీయగా..
హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బగాయత్ ప్రాంతంలో రాత్రి వేళ అనుమానాస్పద పరిస్థితుల్లో ఒంటరిగా తిరుగుతున్న ఓ మహిళను పోలీసులు గుర్తించి, ఆమెను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల అప్రమత్తత, వేగవంతమైన స్పందనపై కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్‌లోని మమతా నగర్‌కు చెందిన బుడిగ స్వాతి (56) కుటుంబ కలహాల కారణంగా ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తిరిగి ఇంటికి…
