పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరింత బలమైన రక్షణ
అమరావతి, ఆగస్ట్ 31: వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్–1972లోని సెక్షన్ 38U కింద G.O.Ms.No.42 ద్వారా ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కమిటీకి చైర్‌పర్సన్‌గా, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. PCCF & HoFF, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులకు సభ్యత్వం కల్పించారు. ప్రాజెక్ట్ టైగర్ నంద్యాల ఫీల్డ్ డైరెక్టర్ కూడా కమిటీలో సభ్యుడిగా ఉంటారు. వన్యప్రాణి నిపుణులు డా లక్ష్మీరాణి, మూర్తి కాంతిమహంతికి…
