తాజావార్తలు

Tech Tips: మీ కంప్యూటర్‌లో ఈ ఒక్క సెట్టింగ్ ON చేస్తే చాలు వైరస్ అస్సలు రాదు.. ఎవ్వరు చెప్పిన సీక్రెట్‌!


Tech Tips: నేటి డిజిటల్ ప్రపంచంలో కంప్యూటర్ వైరస్‌లు ఒక పెద్ద సమస్యగా మారాయి. మన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు పంపే వీడియో లింక్‌లు, యాప్ లింక్‌లు లేదా సాఫ్ట్‌వేర్ లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా తరచుగా వైరస్‌లు మన కంప్యూటర్‌లోకి ప్రవేశిస్తాయి. ఈ లింక్‌లను ఇన్‌స్టాల్ చేయడం వల్ల మీ సిస్టమ్‌కు హాని కలగవచ్చు. అయితే, మీ కంప్యూటర్‌ను ఈ వైరస్‌ల నుండి రక్షించడానికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక అద్భుతమైన, చాలా మందికి తెలియని ఫీచర్ ఉంది. అదే విండోస్ శాండ్‌బాక్స్.

విండోస్ శాండ్‌బాక్స్ అనేది మీ కంప్యూటర్‌లోనే ఉండే మరో కంప్యూటర్‌ లాంటిది. అంటే తాత్కాలిక వర్చువల్ కంప్యూటర్ అన్నట్లు. దీన్ని ఉపయోగించడం ద్వారా మీరు ఎలాంటి అనుమానాస్పద ఫైల్‌లను లేదా వెబ్‌సైట్‌లను మెయిన్ సిస్టమ్‌కు ఎటువంటి ముప్పు లేకుండా పరీక్షించవచ్చు. వైరస్ ఉన్నప్పటికీ, అది శాండ్‌బాక్స్‌కు మాత్రమే పరిమితం అవుతుంది. మీ నిజమైన ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రభావితం చేయదు. మీరు శాండ్‌బాక్స్‌ను మూసివేసిన వెంటనే, అందులోని మొత్తం డేటా తొలగించబడుతుంది. తద్వారా మీ సిస్టమ్ ఎప్పుడూ సురక్షితంగా ఉంటుంది.

ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం చాలా సులువు. ముందుగా విండోస్ + R బటన్‌లను నొక్కి “రన్” విండోను తెరవండి. అందులో OPTIONALFEATURES అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు తెరుచుకునే విండోలో “Windows Sandbox” అనే ఆప్షన్‌ను గుర్తించి, దానికి టిక్ చేసి “OK” బటన్ నొక్కండి. ఆ తర్వాత మీ కంప్యూటర్‌ను రీస్టార్ట్ చేయమని అడుగుతుంది. రీస్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ మెనూలో “Sandbox” అని సెర్చ్ చేసి విండోస్ శాండ్‌బాక్స్ ఓపెన్‌ చేయవచ్చు. ఇకపై మీరు ఇందులో గేమ్స్, బ్రౌజర్లు లేదా ఏవైనా ఇతర అప్లికేషన్లను వైరస్ భయం లేకుండా ఇన్‌స్టాల్ చేయవచ్చు లేదా పరీక్షించవచ్చు.

ఇది కూడా చదవండి: Red Bricks: ఎర్ర ఇటుకలకు ఆ రంగు ఎలా వస్తుంది? మట్టి నుంచి కొలిమి వరకు జరిగే అసలు ప్రక్రియ ఇదే!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *