పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను ఢీకొట్టడంపై సీరియస్..
అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో భారత్, పాకిస్థాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత నావికాదళానికి చెందిన ఫ్రంట్లైన్ యుద్ధనౌకను పాకిస్థాన్ యుద్ధనౌక ఉద్దేశపూర్వకంగా అత్యంత ప్రమాదకర రీతిలో వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఢిల్లీలోని పాకిస్థాన్ సీనియర్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసి గట్టి నిరసనను నమోదు చేసింది. సెప్టెంబర్ 15 సాయంత్రం ఉత్తర అరేబియా సముద్రంలోని…
