Aadhaar Card: ఆధార్ కార్డులపై బిగ్ అప్డేట్.. త్వరలో పూర్తిగా మారనున్న డిజైన్.. కొత్త కార్డ్ ఎలా ఉంటుందంటే..?
ఆధార్ కార్డుపై బిగ్ అప్డేట్ వచ్చింది. అత్యంత ముఖ్యమైన ఈ గుర్తింపు ధృవీకరణ పత్రం దుర్వినియోగం కాకుండా వినియోగదారులకు మరింత భద్రత కల్పించే దిశగా యూఐడీఏఐ సిద్దమవుతోంది. యూజర్ల డేటా చోరీ కాకుండా అరికట్టేందుకు ఆధార్ డిజైన్‌ను పూర్తిగా మార్చేందుకు రంగం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా త్వరలో కొత్త డిజైన్ ఆధార్ కార్డులను జారీ చేయాలని యూఐడీఏఐ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ కార్డులో యూజర్ల వివరాలైన పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, తండ్రి పేరు, క్యూఆర్…
