Parental Conflict Effects: పిల్లల ముందే గొడవ పడుతున్నారా? తల్లిదండ్రుల పోట్లాటల వల్ల పసిమనసులపై పడే ప్రభావాలివే!
తల్లిదండ్రులు తమ గొడవల్లో మునిగిపోయి, పక్కనే ఉన్న పసిపిల్లల కళ్లలో కనిపిస్తున్న భయాన్ని గమనించలేకపోతున్నారు. ఈ నిరంతర ఘర్షణలు పిల్లల మనసుపై ఎంతటి లోతైన గాయాలు చేస్తాయో తెలుసుకుందాం.. చిన్న పిల్లలు తమ తల్లిదండ్రుల మీద పూర్తిగా ఆధారపడి ఉంటారు. ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుంటే వారు అభద్రతా భావానికి లోనవుతారు. తమకు రక్షణగా ఉండాల్సిన వారే ఇలా కొట్టుకుంటుంటే, తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వారిని వేధిస్తుంది. దీనివల్ల వారు భయస్తులుగా మారిపోతారు లేదా ప్రవర్తనా…
