తాజావార్తలు

నవ జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ అంతలోనే విషాదం!

నవ జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ అంతలోనే విషాదం!


త్వరలో పెళ్లి పీటలెక్కి.. వివాహబంధంతో ఒక్కటై నూరేళ్లు కలిసి బతకాల్సిన ఓ యువజంట జీవితాల్లో ‘ప్రీ వెడ్డింగ్’ సరదా తీరని విషాదాన్ని నింపింది. కాబోయే భార్య పుట్టినరోజున ఫొటోలు తీస్తూ, ప్రమాదవశాత్తు 400 అడుగుల లోతున్న లోయలో పడి ఓ యువ వ్యాపారవేత్త అక్కడికక్కడే మరణించాడు. మహారాష్ట్రలోని పుణె జిల్లా చారిత్రాత్మక లోహగఢ్ కోట వద్ద ఈ దుర్ఘటన జరిగింది. పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన కేతన్ విశాల్ అగర్వాల్ తన కుటుంబ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే నవంబరులో అతనికి పెళ్లి నిశ్చయం కావడంతో ఉదయ్‌పుర్ ప్యాలెస్‌ను కూడా బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం కాబోయే నవవధువు పుట్టినరోజు కావడంతో, ఇద్దరు స్నేహితులతో కలిసి కేతన్ ఆమెను లోహగఢ్ కోటకు తీసుకువెళ్లాడు. అక్కడ దట్టమైన పొగమంచు, అందమైన వాతావరణం మధ్య యువతి ఫొటోలు తీసేందుకు కేతన్ ప్రయత్నించాడు. అయితే, ఒక్కసారిగా వీచిన హోరుగాలికి అతడు అదుపుతప్పి, పక్కనే ఉన్న 400 అడుగుల లోతైన లోయలోకి జారిపడిపోయాడు. ఈ ప్రమాదంలో కేతన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే కాబోయే భర్త అనంతలోకాలకు వెళ్లడంతో ఆ యువతి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మరో 4 నెలల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఇంట్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీలో 50 టన్నుల బంగారు కొండ! దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *