రెండోది అత్యంత ముఖ్యమైనది విద్యుత్ వినియోగం. ఏసీలు కంప్రెసర్ సహాయంతో పనిచేస్తాయి కాబట్టి పవర్ ఎక్కువగా లాగుతాయి. కానీ కూలర్లు కేవలం వాటర్ ఎవాపరేషన్, ఫ్యాన్ సహాయంతో నడుస్తాయి. ఒక సాధారణ కూలర్ గంటకు కేవలం 150 నుండి 300 వాట్ల కరెంట్ మాత్రమే వాడుకుంటుంది. దీనివల్ల నెలంతా వాడినా బిల్లు రూ.500 లోపే వస్తుంది. అదే ఏసీ విషయానికి వస్తే, గంటకు 1200 నుండి 2,000 వాట్ల వరకు విద్యుత్‌ను వినియోగిస్తుంది. రోజుకు 8 గంటల చొప్పున రన్ చేస్తే, నెలవారీ కరెంట్ బిల్లు రూ. 2,000 నుండి రూ. 4,000 దాటే అవకాశం ఉంది.
