తాజావార్తలు

సింగీతంగారు తీసిన మొదటి సినిమా.. జాతీయ అవార్డు గెలిచిన దిక్కట్ర పార్వతి గురించి ఆసక్తికర విషయాలు..

ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు తన జీవితంలోని విశేష ఘట్టాలను, సినీ రంగంలో తన తొలి అడుగులను, దిక్కట్ర పార్వతి చిత్ర నిర్మాణంలోని కీలక నిర్ణయాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన కేవలం ఒక దర్శకుడిగానే కాకుండా, జీవితాన్ని, కళను లోతుగా విశ్లేషించే తత్వవేత్తగా తన దృక్పథాన్ని వెల్లడించారు. ఆయన తొలి వృత్తి పాఠశాల ఉపాధ్యాయుడిగా ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన నాటకాలు రాయడం ప్రారంభించారు, వాటికి అవార్డులు కూడా వచ్చాయి. మద్రాసు చేరుకున్న…

Read More

తింటే ఇలాంటి పచ్చడి తినాలి.. దగ్గు, జలుబు, అజీర్ణం ఇట్టే మటుమాయం..

వామాకుల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వామాకు పచ్చడి, అలాగే పలు రకాల వంటకాలు తయారు చేస్తారు. అందుకే.. వామాకు.. తెలుగు వంటకాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దీని రుచి అద్భుతంగా ఉండటమే కాకుండా, దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలకు, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు వామాకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. ఇంట్లో పెంచుకున్న వామాకు మొక్కతో ఈ పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి…

Read More

పాతబస్తీలో అర్ధరాత్రి హైడ్రామా.. ఒక్కసారిగా భారీగా భద్రతా బలగాల ఎంట్రీ..! అసలేం జరిగిందంటే?

హైదరాబాద్, అక్టోబర్‌ 4: నగరంలోని చారిత్రాత్మక పాతబస్తీలో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మక్కా మస్జిద్, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలు మోహరించడంతో స్థానికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇది ఎలాంటి నిజమైన ప్రమాదం కాదని.. అత్యవసర పరిస్థితుల్లో భద్రతా బలగాల సన్నద్ధతను పరీక్షించేందుకు నిర్వహించిన మాక్ డ్రిల్ అని అధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాద దాడులు లేదా ఇతర క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భద్రతా బలగాలు ఎంత వేగంగా…

Read More

Israeli PM: పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు నెతన్యాహు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌కు రావాలంటూ ఆహ్వానం!

Israeli Prime Minister: ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన తీవ్ర ఘటనలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ధైర్యంగా వ్యవహరించిన భారతీయ పైలట్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ఆయనతో ఫోన్‌లో మాట్లాడి అభినందించారు. అంతేకాదు, ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ‘మీరు ప్రపంచానికే హీరో’.. నెతన్యాహు ప్రశంసలు స్మిత్ మచ్ఛర్‌తో ఫోన్ సంభాషణ సందర్భంగా నెతన్యాహు ఆయన ధైర్యాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. భారత్,…

Read More

Megastar Chiranjeevi: మౌనంగా ఉండటానికి వీల్లేదు.. చుట్టమల్లే సాంగ్ వివాదం పై చిరంజీవి ఆగ్రహం..

ప్రస్తుతం కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఏ స్థాయిలో వినియోగిస్తున్నారో చెప్పక్కర్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఏఐ వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఏఐను కొందరు ఆగతాయిలు ఇష్టానుసారంగా దుర్వినియోగం చేస్తూ సినీ ప్రముఖులపై అసభ్యకర కంటెంట్ సృష్టించడంపై టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర’ చిత్రంలోని హిట్ సాంగ్ ‘చుట్టమల్లే’ లోని దృశ్యాలను ఏఐ సాంకేతికతతో మార్ఫింగ్ చేసి నెట్టింట…

Read More

ఏపీ హైకోర్టులో 119 సివిల్ జడ్జి ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.1.36 లక్షలు! ఎలా ఎంపిక చేస్తారంటే..

లా డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ న్యాయ సేవల్లో కెరీర్‌ కొనసాగించాలనుకునే అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ గుడ్‌న్యూస్‌ అందించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌లో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 119 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్‌ 26, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు…

Read More

కల కోసం కోట్ల జీతం కాదనీ.. తొలి ప్రయత్నంలోనే UPSC సివిల్స్‌లో 24వ ర్యాంక్ కొట్టి IAS అయ్యాడు!

పృధ్వీ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల. తండ్రి అక్కడే జ్యువెలరీ షాప్‌ నిర్వహిస్తుండగా.. తల్లి గృహిణి. ఏడో తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకున్న పృధ్వీ.. ఆ తర్వాత గుడివాడలోని విశ్వభారతి పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. 2011-15 బ్యాచ్‌లో ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే మంచి ప్రతిభ కనబరిచిన ఆయన.. ఇంజనీరింగ్‌ అనంతరం తన కెరీర్‌ను అంతర్జాతీయ స్థాయిలో ప్రారంభించారు. శాంసంగ్‌లో…

Read More

ఒమన్ పక్కన పెడితే.. ఫ్లైదుబాయ్ ఎలా తీసుకుంది? కాక్‌పిట్ దాడి వెనుక నివ్వెరపోయే విషయాలు

దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌ వెళ్లాల్సిన ఫ్లైదుబాయ్‌ విమానం. సెప్టెంబర్‌ 30న 170 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరింది. అంతా సాఫీగానే ఉందనుకునే సమయంలో సౌదీ గగనతలంలో ఒక్కసారిగా విమానం కిందికి జారడం మొదలైంది. చూస్తుండగానే 16 వేల అడుగులకు పైగా కిందికి పడిపోయింది. విమానంలో ఉన్నవాళ్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కొందరికి పెద్ద టర్బులెన్స్‌ వచ్చినట్టుగా అనిపించింది. కానీ అసలు గొడవ విమానం బయట కాదు. కాక్‌పిట్‌లో జరుగుతోంది. ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన…

Read More

Telangana: అమెరికా వెళ్లిన కల.. క్యాన్సర్‌తో ముగిసిన జీవితం..

పై చదువుల కోసమని విదేశాలకు వెళ్లిన.. యువతి క్యాన్సర్ కారణంగా.. అక్కడే ప్రాణాలు కోల్పోయింది నల్గొండ జిల్లాకు చెందిన మాన్వితా రెడ్డి అనే యువతి. వివరాల్లోకి వెళ్తే.. వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన కందిమల్ల లక్ష్మారెడ్డి, పద్మ దంపతుల చిన్న కుమార్తె మాన్వితా రెడ్డి (27). హైదరాబాద్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె, ఉన్నత విద్యను అభ్యసించేందుకు మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆమె మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ సమీపంలో తన స్నేహితులతో కలిసి…

Read More

IND vs WI 3rd ODI: చండీగఢ్ వన్డేలో భారత్‌కు షాక్.. మూడో మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘన విజయం

భారత్, వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. శనివారం న్యూ చండీగఢ్‌లోని మహారాజా యద్వింద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్‌‌పై వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి భారత్‌ ఇచ్చిన 352 పరుగుల టార్గెట్‌ను వెస్టిండీస్‌ 48.2 ఓవర్లలోనే చేధించి.. విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సిరీస్‌ను మాత్రం..భారత్‌కే దక్కింది. మొత్తం మూడు వన్డేల్లో తొలి రెండు వన్డేల్లో పై చేయి…

Read More